close

తాజా వార్తలు

పెళ్లికొచ్చిన అతిథులకు ‘వెచ్చటి’ మర్యాద

రాజ్‌కోట్‌(గుజరాత్‌): చలికాలంలో రాత్రిపూట వేడుకలకు హాజరు కావాలంటే ప్రజలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. ‘చలిలో ఇబ్బందులు పడటం ఎందుకులే’ అని ఇంట్లోనే దుప్పటి కప్పుకొని కూర్చొంటారు.  ఇలా అయితే.. మండపం ఖాళీగా  ఉంటుందని అనుకున్నారో ఏమో! ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన గుజరాత్‌కు చెందిన రాజ్‌కోట్‌లోని ఓ కుటుంబం, వివాహ వేడుకల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పెళ్లికి వచ్చిన బంధువులకు చలి మంటలతో ఆతిథ్యం ఇచ్చింది. చలి-పులిని తట్టుకునేలా అసలుసిసలైన మర్యాదలు చేసినందుకు బంధువులంతా పొంగిపోయారు. చిమ్నీ దగ్గర వెచ్చగా కూర్చొని నవదంపతులు పది కాలాల పాటు చల్లగా ఉండాలని దీవించారు. 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.