close

తాజా వార్తలు

‘ఇండియన్స్‌ అంటే భయపడాలి అందరూ..’

విశాఖ: ఆ బాలిక స్కేటింగ్ విన్యాసాలు చూస్తే.. శరీరంలో వెన్నెముక ఉందా లేదా అనే సందేహం కలగక మానదు. స్కేటింగ్ రింక్‌లో ఆమె చేసే భంగిమలు చూపు తిప్పుకోకుండా చేస్తాయి. స్కేటింగ్లో సత్తాచాటుతూ అంతర్జాతీయ పతకాలను సైతం సొంతం చేసుకుంటోంది. నాన్న కలలను సాకారం చేస్తూ ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలపురస్కార్ -2020కు ఎంపికైన ఆ బాలికే సాయిసంహిత. 

విశాఖలోని సత్య సాయి విద్యా విహార్‌లో పదో తరగతి చదువుతోంది సాయి సంహిత. తన నాలుగో ఏట నుంచే స్కేటింగ్‌తో విడదీయరాని బంధాన్ని ఏర్పర్చుకుంది. ఉదయం 5 గంటలకే స్కేంటింగ్‌ రింక్‌లో సాధన చేయడం నుంచే ఆమె దినచర్య మొదలవుతుంది. పదేళ్ల నుంచి సంహిత కృషికి తగ్గట్టు ఎన్నో అవార్డులు ఆమెను వరించాయి. తండ్రి ఆకుల పవన్‌ కుమార్‌ శిక్షణలో ఆమె మరింత రాటుదేలింది. ప్రస్తుతం ఆయన జాతీయ రోలర్‌ స్కేటింగ్‌ జట్టుకు కోచ్‌గా ఉన్నారు.

2015 మహారాష్ట్రలో నిర్వహించిన జాతీయ రోలర్‌ స్కేటింగ్‌ పోటీల్లో ఫ్రీస్టైల్‌, ఇన్‌లైన్‌ ఫ్రీస్టైల్‌ విభాగాల్లో సాయి సంహిత స్వర్ణాలు, క్వాడ్‌ విభాగంలో రజతం సాధించింది. 2018 దక్షిణ కొరియాలో జరిగిన 18వ ఆసియా రోలర్ స్కేటింగ్‌లో క్యాడెట్‌ గర్ల్స్‌ విభాగంలో స్వర్ణం గెలుచుకుంది. ఇప్పటి వరకు సుమారు 65 పతకాలు సాధించింది. అందులో జాతీయ స్థాయిలో 21 పతకాలు కాగా, వాటిలో 14 స్వర్ణాలు ఉండటం విశేషం. స్కేటింగ్‌ చేస్తూ రుమాలు నోటితో తీయడం సాయి సంహిత ప్రత్యేకత. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలపురస్కార్‌-2020కు ఎంపికైన సాయి సంహిత రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ నెల 22న దిల్లీలో ఆ అవార్డును అందుకోనుంది. 

‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలపురస్కార్‌ అవార్డుకు ఎంపికవ్వటం ఆనందంగా ఉంది. భవిష్యత్‌లో జాతీయస్థాయి జూనియర్‌ విభాగంలో స్వర్ణం తీసుకురావటమే లక్ష్యంగా పెట్టుకున్నాను. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి భారతదేశం పేరును నిలబెడతా. బరిలో భారతీయులు ఉంటే మిగతా దేశాలవారు భయపడాలి’ అని సాయి సంహిత అంటోంది.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.