close

తాజా వార్తలు

బాలయ్యతో సెల్ఫీకి పోటీపడిన వైకాపా ఎమ్మెల్యేలు!

అమరావతి: ప్రముఖ సినీనటుడు, తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో సెల్ఫీ దిగేందుకు వైకాపా ఎమ్మెల్యేలు పోటీ పడ్డారు. శాసన మండలి సమావేశాలు ఉత్కంఠగా సాగుతున్న సమయంలో తిలకించేందుకు తెదేపా అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు గ్యాలరీకి వెళ్లారు. వారితో పాటు బాలకృష్ణ కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ సమయంలో కొంతమంది వైకాపా ఎమ్మెల్యేలు అక్కడికి చేరుకుని బాలకృష్ణతో సరదాగా మాట్లాడారు. ఆ సమయంలో ఆయనతో సెల్ఫీ దిగేందుకు వారు పోటీపడ్డారు. వైకాపా ఎమ్మెల్యేలు రోజా, కాసు మహేశ్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, అబ్బయ్యచౌదరి, వసంత కృష్ణప్రసాద్‌ తదితరులు బాలయ్యతో సెల్ఫీ దిగారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.