close

తాజా వార్తలు

ఆర్డినెన్స్‌ ఇవ్వడం అసాధ్యం: యనమల

అమరావతి: శాసనమండలిలో జరిగిన పరిణామాలపై తెదేపా సీనియర్‌ నేత, మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. గురువారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ..సెలెక్ట్‌ కమిటీకి బిల్లు వెళ్లాక ఆర్డినెన్స్‌ ఇవ్వడం అసాధ్యమని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు నిబంధనలకు ఇది విరుద్ధమన్నారు. ‘‘నిన్న మేం అడిగిన సెలెక్ట్‌ కమిటీ మండలికి సంబంధించి మాత్రమే. జాయింట్‌ సెలెక్ట్‌ కమిటీ అడగలేదు. జాయింట్‌ సెలెక్ట్‌ కమిటీ అడిగి ఉంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందులో సభ్యులుగా ఉంటారు. నేను సెలెక్ట్‌ కమిటీకి ఛైర్మన్‌గా కూడా పనిచేశా. సెలెక్ట్‌ కమిటీ ఏర్పడ్డాక ప్రజాభిప్రాయం కూడా తీసుకోవచ్చు. అన్ని ప్రాంతాల్లో పర్యటించి అందరి అభిప్రాయాలు తీసుకోటానికి సెలెక్ట్‌ కమిటీకి తగినంత సమయం అవసరం. ఈ ప్రక్రియ ముగియటానికి మూడు నెలల కంటే ఎక్కువ సమయం పట్టొచ్చు. సెలెక్ట్‌ కమిటీ నిర్ణయానికి కనీస సమయం 3నెలు. దీని అర్ధం 3 నెలల్లోపు ఇమ్మని కాదు. మండలి రద్దుకు మేం ఎప్పుడూ బాధపడం, భయపడం కూడా. నిన్న సభలోకి మంత్రులు తాగి వచ్చారు. లోకేశ్‌ను కొట్టే ప్రయత్నం చేశారు. సభలో ఎప్పుడూ చూడని పరిణామాలను నిన్న మంత్రులు ప్రదర్శించారు’’ అని యనమల తెలిపారు. 

ఇవీ చదవండి..

3 రాజధానులకు ఎదురుదెబ్బ
ఇప్పుడు ఏమౌతుంది?
అసెంబ్లీలో రూల్స్‌ గుర్తుకు రాలేదా?
చంద్రబాబుపై పూలవర్షం

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.