close

తాజా వార్తలు

కపిల్‌ కోసం నాగార్జున, కమల్‌హాసన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత క్రికెట్‌ జట్టు తొలిసారి ప్రపంచకప్‌ను అందుకున్న మధుర క్షణాలను ఏ క్రీడా ప్రియుడు మర్చిపోలేడు. ఆ అరుదైన క్షణాలను ఎప్పుడు తలుచుకున్న మనసు భావోద్వేగంతో ఉప్పొంగుతుంది. అలాంటి అరుదైన దృశ్యాన్ని వెండితెరపై చూపించేందుకు సిద్ధమవుతున్నారు కబీర్‌ ఖాన్‌. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రీడా నేపథ్య చిత్రం ‘83’. 1983 క్రికెట్‌ ప్రపంచకప్‌ ఇతి వృత్తంగా ఈ సినిమా సాగనుంది. అప్పటి భారత క్రికెట్‌ జట్టు సారథిగా రణవీర్‌ సింగ్‌ కనిపించనున్నాడు. ఆయనకు జోడీగా దీపిక పదుకొణె నటిస్తోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాను ఏప్రిల్‌ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదల చేయనున్నారు.

తెలుగులో ఈ చిత్రానికి సమర్పకులుగా అగ్ర కథానాయకుడు నాగార్జున వ్యవహరిస్తుండగా, తమిళంలో కమల్‌హాసన్‌ సమర్పిస్తున్నారు. ఈ మేరకు ‘83’ చిత్ర బృందం నాగార్జున, కమల్‌లతో కలిసి దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. 

‘‘భారత క్రికెట్‌ జట్టు 1983లో తొలిసారి ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఆ మధుర క్షణాలను ఎప్పుడు తలుచుకున్నా ఒళ్లు గగురుపొడుస్తుంది. ‘83’ తెలుగు వెర్షన్‌కు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ -ట్విటర్‌లో నాగార్జున


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.