close

తాజా వార్తలు

మేకప్‌ లేకుండా సుమ..

హైదరాబాద్‌: టెలివిజన్‌ కార్యక్రమాలు, ఆడియో ఫంక్షన్స్‌, ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లను తనదైన మాటలు, సమయస్ఫూర్తితో రక్తికట్టించే వ్యాఖ్యాత సుమ. బుల్లితెర ప్రేక్షకులు తమ కుటుంబంలో ఒక వ్యక్తిగా ఆమెను భావిస్తారంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఆమె మైక్‌ అందుకుందంటే ఆ మాటల ప్రవాహం ఆపడం ఎవరికీ సాధ్యం కాదు. ‘తను స్టేజ్‌ ఎక్కేంత వరకే.. వన్స్‌ స్టెప్‌ ఇన్‌..’ ఆ తర్వాత చెప్పాల్సిన పనిలేదు. అలాంటి సుమ తాజాగా తన ఇన్‌స్టాలో ఓ వీడియోను పంచుకుంది. 

‘నా ఉదయాలు ఇలాగే ఉంటాయి. మేకప్‌ లేకుండా నా శరీరం శ్వాస తీసుకుంటోంది. ధన్యవాదాలు వివేక వర్థిని కాలేజ్‌, వాసు యాడ్స్‌’ -ఇన్‌స్టాలో సుమ

‘గుడ్‌మార్నింగ్‌. నిన్న క్యాష్‌ షూటింగ్‌ అయింది. క్యాష్‌ అయిపోయిన తర్వాత పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఆ షోలో వివేక వర్థిని కాలేజ్‌ వాళ్లు ఈ పెయింటింగ్‌ ఇచ్చారు. నిజంగా చాలా అందంగా ఉంది. కాలేజ్‌ విద్యార్థులు, వాసు యాడ్స్‌ వారికి థ్యాంక్స్‌. ఇందుకోసమైనా మనం మేకప్‌ వేసుకుని కష్టపడి పనిచేయాలనిపిస్తుంది. సత్తి, రమేష్‌ పదండి. యుద్ధానికి వెళ్దాం’ అని ఇన్‌స్టా వీడియోలో పేర్కొన్నారు. 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.