close

తాజా వార్తలు

భారత్‌కు అక్రమ వలసదారులు పెరిగారు

కోల్‌కతా: ఇటీవల కాలంలో బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌లోకి ప్రవేశించే అక్రమ వలసదారుల సంఖ్య పెరిగిందని సరిహద్దు భద్రతాదళం (బీఎస్‌ఎఫ్‌) వెల్లడించింది. భారత్‌ అమలు చేసిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కూడా దీనికి ఓ కారణం కావొచ్చని అభిప్రాయపడింది. ఈ మేరకు బీఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ వైబి ఖురానీ మీడియాకు తెలిపారు. ఒక్క జనవరి నెలలోనే ఇప్పటి వరకూ 268 మందిని పట్టుకున్నామని, వారిలో చాలామంది అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన వారేనని ఆయన వివరించారు.

భారత్‌కు పొరుగు దేశాలైన అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ల నుంచి మతపరమైన దాడులు, హింస కారణంగా వేరే మార్గాల్లో వచ్చిన హిందూ, సిక్కు, జైన్‌, బౌద్ధ, పార్శీ, క్రైస్తవులకు భారతీయ పౌరసత్వం కల్పిస్తూ భారత ప్రభుత్వం సీఏఏను అమల్లోకి తీసుకొచ్చింది. ఇంతకు ముందు వరకు ఎవరైనా అక్రమంగా భారత్‌కు వస్తే.. వారిని చట్టవ్యతిరేక కాందిశీకులుగా ముద్ర వేసేవారు. ఎలాంటి పత్రాలు లేకుండా భారత్‌కు వచ్చి నిర్ధారిత సమయానికి మించి ఇక్కడే తలదాచుకున్న వారందర్నీ అక్రమ వలసదార్లు (ఇల్లీగల్‌ ఇమిగ్రెంట్‌)గానే గుర్తించేవారు. ఇప్పుడు అలాంటి వారందరికీ భారతీయ పౌరసత్వం ఇస్తున్నారు. అయితే ముస్లింలను ఇందులో విస్మరించడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.