close

తాజా వార్తలు

ఓడిపోతామని కోచ్‌కు చెప్పా: కోహ్లీ

హామిల్టన్‌: టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ, పేసర్‌ మహ్మద్ షమిపై ప్రశంసలు కురిపించాడు. అద్భుతమైన విజయాన్ని అందించారని అభినందించాడు. ఛేదనలో కేన్‌ విలియమ్సన్‌ బ్యాటింగ్‌ చూసి ఒకానొక దశలో మ్యాచులో ఓటమి తప్పదని భావించానని వెల్లడించాడు. మూడో టీ20లో మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 179 పరుగులు చేసింది. ఛేదనలో చెలరేగిన విలియమ్సన్‌ (95), రాస్‌టేలర్‌ను ఆఖరి ఓవర్లో షమి ఔట్‌ చేయడంతో స్కోర్లు సమం అయ్యాయి. సూపర్‌ ఓవర్లో ఆఖరి రెండు బంతుల్లో 10 పరుగులు అవసరం కాగా రోహిత్‌ వరుస సిక్సర్లతో విజయం అందించాడు.

‘ఒకానొక దశలో మ్యాచ్‌ చేజారిందని అనుకున్నా. కేన్‌ విజృంభించిన తీరు చూసి వారు విజయాని అర్హులని కోచ్‌తో చెప్పాను. కీలక సమయంలో మాకు అతడి వికెట్‌ లభించింది. కొన్ని బంతుల్ని ఆఫ్‌సైడ్‌ వేసి షమి మరోసారి తన అనుభవాన్ని ప్రదర్శించాడు. ఆఖరి బంతికి ఎలా బౌలింగ్‌ చేసినా సింగిల్‌ తీస్తారని మాకు తెలుసు. అందుకే నేరుగా వికెట్లకు విసరమని చెప్పాను. షమి అదే చేశాడు. టేలర్‌ ఔటయ్యాడు. మ్యాచ్‌ మలుపు తిరిగింది’ అని కోహ్లీ అన్నాడు.

‘సూపర్‌ ఓవర్లో న్యూజిలాండ్‌ మళ్లీ మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టింది. విలియమ్సన్‌ చక్కని షాట్లు ఆడాడు. కానీ ఈ రోజు రోహిత్‌ మంచి టచ్‌లో కనిపించాడు. సగం ఓవర్‌ అయ్యాక రోహిత్‌ ఒక్క షాట్‌ బాదితే చాలు బౌలర్‌ ఒత్తిడిలోకి వెళ్తాడని అనుకున్నా. ఎందుకంటే అతడు అద్భుతంగా బంతిని బాదేస్తాడు. మొత్తంగా ఇదో చక్కని మ్యాచ్‌. ఆఖరి ఓవర్లో షమి ఆ రెండు బంతులకు పరుగులివ్వకుండా వికెట్‌ తీస్తే సూపర్‌ఓవర్‌కు వెళ్తామనుకున్నా. అందులో ఒత్తిడికి గురిచేస్తే కివీస్‌ గతి తప్పుతుందని భావించా. కానీ ప్రపంచంలోని అత్యుత్తమ డెత్‌ స్పెషలిస్టుల్లో ఒకడైన బుమ్రా బౌలింగ్‌ను కేన్‌ చక్కగా ఎదుర్కొన్నాడు. మేం ఈ సిరీస్‌ను 5-0తో గెలిచేందుకు ప్రయత్నిస్తాం. ఇప్పటి వరకు సైని, సుందర్‌ ఇంకా మరికొందరు ఆడలేదు. వారికో అవకాశం ఇవ్వాలి’ అని కోహ్లీ పేర్కొన్నాడు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.