close

తాజా వార్తలు

Updated : 20/02/2020 10:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Comments

‘రజనీ వర్సెస్‌ వైల్డ్‌’ వచ్చేస్తోంది

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అభిమానుల ఎదురుచూపులకు అతి త్వరలోనే తెర పడనుంది. గత నెలలో కర్ణాటకలోని బందీపూర్‌ నేషనల్‌ పార్కులో చేపట్టిన ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్’ షూటింగ్‌లో రజనీకాంత్‌ పాల్గొన్న విషయం తెలిసిందే. షూటింగ్‌ ప్రారంభం నుంచే ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్‌ వస్తుందా? అని ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ షూటింగ్‌లో సాహసవీరుడు బేర్‌ గ్రిల్స్‌తో కలిసి రజనీ సాహస కృత్యాలు చేశారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించి అభిమానులకు బేర్‌ గ్రిల్స్‌ ఓ తీపి కబురు చెప్పాడు. అతి త్వరలోనే రజనీ వర్సెస్‌ వైల్డ్ ఎపిసోడ్‌ అభిమానుల ముందుకు రానుందని ప్రకటించాడు. తన ట్విటర్‌ ఖాతాలో బేర్‌ ఈ విషయం వెల్లడించాడు.

‘రజనీకాంత్ బ్లాక్‌బస్టర్‌ ఎపిసోడ్‌ కోసం సిద్ధమవుతున్నాం. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది స్టార్లతో నేను పని చేశాను. కానీ, అందరిలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో చేసిన ఈ ఎపిసోడ్‌ నాకెంతో ప్రత్యేకం. ఐ లవ్‌ ఇండియా’ అని పోస్టు చేస్తూ ఓ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశాడు. ఆ పోస్టర్‌లో జీపుపై ఓవైపు రజనీకాంత్‌ కాలుపెట్టి నిల్చోగా మరోవైపు గ్రిల్స్‌ ఉన్నాడు. గతంలో భారత ప్రధాని నరేంద్రమోదీతో చేసిన ఓ ఎపిసోడ్‌ను ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది ప్రేక్షకులు వీక్షించారని డిస్కవరీ ఛానల్‌ ప్రకటించింది. దీంతో రజనీకాంత్‌ కనిపించే ఈ ఎపిసోడ్‌పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

 




Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.