close

తాజా వార్తలు

పెద్దోడి పెళ్లిలో చిన్నోడి సందడి

ముంబయి: ‘బాఘీ’ వరుస సీక్వెల్స్‌తో మంచి విజయాలను ఖాతాలో వేసుకుంటున్నాడు బాలీవుడ్‌ స్టార్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌. ఇప్పటికే బాఘీ1, బాఘీ 2 అభిమానులను అంచనాలకు మించి అలరించాయి. దీంతో ఈసారి బాఘీ3తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడీ కండల వీరుడు. ఈ చిత్రంలో ష్రాఫ్‌ సరసన శ్రద్ధాకపూర్‌ కనిపించి రొమాన్స్‌ చేయనుంది. రితేశ్‌ దేశ్‌ముఖ్‌ కీలక పాత్ర పోషించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్‌ విడుదలై అభిమానులను మెప్పించింది. అహ్మద్‌ఖాన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రం బృందం సినిమాలోని భాంకాస్‌ అనే పాట విడుదల చేసింది. గాయకులు బప్పీలాహిరి, దేవ్‌నేగి, జోనితా గాంధీ గానం ఆలపించారు. తనిష్క్‌ సంగీతం సమకూర్చారు.
సినిమాలో హీరోకు అన్నయ్య (రితేశ్‌ దేశ్‌ముఖ్‌) వివాహంలో టైగర్‌ష్రాఫ్‌ హీరోయిన్‌ శ్రద్ధాకపూర్‌తో కలిసి ఈ పాటలో డ్యాన్స్‌ చేస్తూ సందడి చేస్తారు. ఈ పాటను దాదాపు 300 మంది బ్యాక్‌గ్రౌండ్‌ డ్యాన్సర్లతో మూడు రోజుల పాటు చిత్రీకరించినట్లు సమాచారం. 1984లో వచ్చిన ‘తొఫా’ సినిమాలోని ‘ఏక్‌ ఆంక్‌ మార్‌’ అనే పాటకు ఇది రీమేక్‌. ఆ సినిమాలో శ్రీదేవి, జితేంద్ర నటించారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.