close

తాజా వార్తలు

ఆ అగ్ర కథానాయకుడితో మరోసారి?

హైదరాబాద్‌:  కొత్త ప్రయత్నాలపై సమంత ఆసక్తి చూపుతోంది. కొత్త కథలు, కొత్త పాత్రల కోసం ఆమె ఆచితూచి సినిమాల్ని ఎంపిక చేసుకుంటున్నారు. తెలుగులో ఇటీవల ఆమె సినిమాలేవీ ఒప్పుకోలేదు. తమిళంలో మాత్రం రెండు చిత్రాలకి పచ్చజెండా ఊపారు. 

తాజాగా తెలుగులో ఇటీవలే ప్రకటించిన ఓ అగ్ర కథానాయకుడి సినిమా కోసం సమంతని సంప్రదించారని సమాచారం. ఇదివరకే ఆమె ఆ కథానాయకుడితో కలిసి నటించారు. చిత్రబృందం సమంత నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్టు సమాచారం. ఈ ఏడాది ఆమె ‘ది ఫ్యామిలీ మేన్‌ 2’ వెబ్‌సిరీస్‌తో డిజిటల్‌ మాధ్యమం ద్వారా  అలరించనున్నారు. టెలివిజన్‌ వైపు కూడా ఆమె దృష్టి పెట్టారని తెలుస్తోంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.