close

తాజా వార్తలు

అంబానీ భేష్‌... ప్రశంసించిన ట్రంప్‌

దిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రశంసించారు. మంగళవారం భారతీయ వ్యాపారవేత్తలతో జరిగిన సమావేశం సందర్భంగా ముకేశ్‌ అంబానీ, కుమార మంగళం బిర్లా, టాటా గ్రూపునకు చెందిన ఎన్‌. చంద్రశేఖరన్‌ వంటి కార్పొరేట్‌ దిగ్గజాలతో ట్రంప్‌ సమావేశమయ్యారు. తమ దేశంలో బిలియన్‌ డాలర్లను పెట్టుబడి పెట్టాల్సిందిగా వారిని కోరారు. ఈ సందర్భంగా అంబానీతో ట్రంప్‌ ముచ్చటించారు.

భారతీయ టెలికాం రంగ ముఖ చిత్రాన్ని మార్చినందుకు అంబానీని ట్రంప్‌ ప్రశంసించారు. ఇందుకు అంబానీ ధన్యవాదాలు తెలుపుతూ... అమెరికా శక్తి రంగంలో ఆర్‌ఐఎల్ ఏడు బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టిన విషయాన్ని వివరించారు. అది పెద్ద మొత్తమని ట్రంప్‌ అభినందిస్తూ.. అంబానీని 5జీ గురించి ప్రశ్నించారు. దీనికి సమాధానంగా .. ఒక్క చైనా పరికరాన్ని కూడా వాడకుండా 5జీ సాంకేతికతను అభివృద్ది చేస్తున్న సంస్థ ప్రపంచ వ్యాప్తంగా రిలయన్స్‌ జియో ఒక్కటే అని అంబానీ వివరించారు. కాగా పన్ను రేట్లను తగ్గించటం ద్వారా అమెరికాను వాణిజ్యానికి మరింత అనుకూలంగా చేసినందుకు ట్రంప్‌కు అంబానీ కృతజ్ఞతలు తెలిపారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
besttaxfiler
VITEEE 2020
HITS2020
Saket Pranamam
dr madhu

Panch Pataka

దేవతార్చన