close

తాజా వార్తలు

అందుకే ఉదయ్‌ కిరణ్‌ బయోపిక్‌ తీయను: తేజ

హైదరాబాద్‌: దివంగత నటుడు ఉదయ్‌ కిరణ్‌ బయోపిక్‌ తీసే ఉద్దేశం తనకు లేదని దర్శకుడు తేజ అన్నారు. ‘చిత్రం’ సినిమాతో ఉదయ్‌ని నటుడిగా తేజ వెండితెరకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విజయం సాధించింది. తొలి సినిమాతోనే ఉదయ్‌ స్టార్‌ అయిపోయారు. తర్వాత రెండో సినిమా ‘నువ్వు నేను’ను కూడా తేజ తెరకెక్కించారు. ఈ సినిమా కూడా సక్సెస్‌ అందుకుంది. ఇలా ఉదయ్‌-తేజల కాంబినేషన్‌ హిట్‌ అనిపించుకుంది. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా చిత్ర పరిశ్రమకు వచ్చిన ఉదయ్‌ పెద్ద హీరోగా మారారు. తర్వాత ఆయన కెరీర్‌ ఒడుదొడుకులతో సాగింది. 2014లో ఉదయ్‌ ఆత్మహత్య చేసుకుని చిత్ర పరిశ్రమను, అభిమానుల్ని షాక్‌కు గురిచేశారు.

ఆ తర్వాత ఉదయ్‌ బయోపిక్‌ రానుందని ప్రచారం జరిగింది. ఆయన జీవితం గురించి బాగా తెలిసిన తేజ సినిమాను రూపొందించనున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే బయోపిక్‌ గురించి తేజ తాజాగా ఓ మీడియాతో మాట్లాడారు. ‘వ్యక్తిగత జీవితానికి సంబంధించి విషయాలన్నీ ఉదయ్‌ నాతో పంచుకునేవాడు. అతని రహస్యాలూ నాకు తెలుసు. అయినప్పటికీ అతని జీవితం ఆధారంగా నేను సినిమా తీయను. ఎందుకంటే వాటితో నేను డబ్బు సంపాదించాలని అనుకోవడం లేదు’ అని అన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.