close

తాజా వార్తలు

Published : 01/01/1970 05:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చంద్రయాన్‌-1 ఓ సంచలనం. భారత అంతరిక్ష చరిత్రలో పెద్ద ముందడుగు! దాదాపు దశాబ్దం తర్వాత ఇప్పుడు మళ్లీ చంద్రమండలానికి రెండో యాత్ర చేపట్టింది. ఈ క్రమంలో ఈనాడు గతకొన్ని రోజులుగా కథనాలు ప్రచురించింది. ఈ రోజు జరిగిన చంద్రయాన్‌ -2 విజయవంతమైన నేపథ్యంలో ముఖ్యమైన కథనాలను ఓసారి చూద్దాం!


చందమామ అందిన రోజు..!

పాలబువ్వ తినే పాపాయిలకు ముద్దుల మామయ్యని... ప్రేమ ఊసులు చెప్పుకునే నవదంపతులకు వెన్నెల రాజుని... శాస్త్రవేత్తలకు మాత్రం నేనో అద్భుతాల గనిని... వెరసి యాభై ఏళ్ల క్రితమే మీ పాదముద్రలతో పునీతమైన చందమామని! నాలుగేళ్లపాటు వరసగా వచ్చి సందడి చేసి మురిపించిన మీరు ఆ తర్వాత నన్ను మర్చిపోయారేమిటా అనుకున్నాను. ఈ మధ్యే మళ్లీ నాతో రెండో హనీమూన్‌కి భారతదేశంతో పాటు మిగతా దేశాలూ సిద్ధమవడం చూస్తున్నా. మరోసారి నన్ను పలకరించేందుకు మీరు వస్తున్నారన్న ఆనందంలో తొలినాటి ముచ్చట్లు మీతో పంచుకోవాలనుకుంటున్నా..!  పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి!


భలే మంచి చౌక బేరమూ!

అమెరికా, రష్యా, చైనా, ఐరోపా సమాఖ్య.. ఇవన్నీ మనదేశం కంటే ముందు నుంచే అంతరిక్షంలో సత్తా చాటుతున్నాయి. కాస్త లేటుగా వచ్చినా లేటెస్టుగా మనదేశం వాటన్నింటికీ దీటుగా ఎదుగుతోంది. వేగంగా ప్రయోగాలకు రూపకల్పన చేస్తూ, అతి తక్కువ ఖర్చుతో వాటిని విజయవంతంగా పూర్తి చేస్తూ ప్రపంచ దేశాలకు సవాళ్లు విసురుతోంది. చౌకలో ప్రయోగాలు చేపట్టడంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు మంచి పేరుంది. ఇప్పటికే అనేక ఉపగ్రహాలు, రాకెట్లను చాలా తక్కువ ధరకు సంస్థ ప్రయోగించింది. గ్రహాంతర యాత్రల విషయంలోనూ ఇదే ఒరవడిని కొనసాగిస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి!


చందమామపై చైనాతో పోటీ!

సోవియట్‌ పతనం తర్వాత అంతరిక్షంపై అమెరికా, ఐరోపాలదే పైచేయిలా తయారైంది. అయితే చైనా ఆగమనంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆర్థికంగా, పారిశ్రామికంగా ప్రపంచ దేశాలన్నింటికీ సవాల్‌ విసురుతున్న చైనా.. రోదసిలోనూ సత్తా చాటుకునేందుకు భారీ కార్యక్రమాలకు తెరతీసింది. ముఖ్యంగా భారీ కేటాయింపులతో చంద్రుడిపై ప్రయోగాలకు పూనుకుంది. ఈ జోరు చూసి... ఇప్పుడు అమెరికా, ఐరోపా, జపాన్‌ తదితర దేశాలు కూడా మళ్లీ చందమామపైకి దృష్టి మళ్లించటం ఆరంభించాయి. పొరుగు నుంచే ఇంతపెద్ద అంతరిక్ష పోటీ ఎదురవుతుంటే.. భారత్‌ మౌనంగా ఉండగలదా? మన చంద్రయాన్‌ శ్రేణి చైనాకు పోటీ ఇవ్వగలదా? దీనివల్ల మనకొచ్చే లాభం ఏంటి? పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి!


రాకెట్కు దారి ఎలా తెలుస్తుందబ్బా ?

చంద్రయాన్‌ 2 వ్యోమనౌక... ఈరోజు అర్ధరాత్రి దాటాక రయ్యిమంటూ అంతరిక్షంలోకి దూసుకుపోనుంది... చంద్రమండలాన్ని శోధించడానికి బయలుదేరనుంది... అక్కడి కబుర్లు మనకు చెప్పనుంది... ఇదంతా సరే... అసలు ఆ రాకెట్‌కి దారి ఎలా తెలుస్తుంది? ఏమైనా అడ్డొస్తే ఏం చేస్తుంది? ఇలాంటివి బోలెడు సందేహాలు మనకే కాదు... చిన్నూకీ వచ్చేశాయ్‌... ఇంకేముంది... వెంటనే వాళ్ల టీచర్‌ దగ్గరకు వెళ్లి అడిగేశాడు... అవేంటో మనమూ చూద్దామా!  పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి!


ఒకటి తర్వాత... రెండెందుకు?

చంద్రయాన్‌-1 ఓ సంచలనం. భారత అంతరిక్ష చరిత్రలో పెద్ద ముందడుగు! వినువీధిలో భారత్‌ సత్తా చాటేందుకు మన ‘మిస్సైల్‌ మ్యాన్‌’.. అబ్దుల్‌ కలాం కన్న కల అది. భారత్‌కు చంద్రుడి మీదకు వెళ్లేంత సత్తా ఉందా? అని యావత్‌ ప్రపంచం ఉత్కంఠగా చూస్తున్న ఘడియల్లో.. మన ఇస్రో ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ సరిగ్గా 11 ఏళ్ల క్రితం చంద్రయానాన్ని నిజం చేసి చరిత్ర సృష్టించింది. దాదాపు దశాబ్దం తర్వాత ఇప్పుడు మళ్లీ రెండో చంద్రమండల యాత్రకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చంద్రయాన్‌-1 సాధించిందేమిటి? మళ్లీ ఇప్పుడు చంద్రయాన్‌-2 ఎందుకు? మొదటి యాత్రకూ, తాజా ప్రయత్నానికీ ఏమిటి తేడా? వంటి ఎన్నో ఆసక్తికర ప్రశ్నలు పైకొస్తున్నాయి! పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి!


పరీక్షల మీద పరీక్ష! 

చందమామ మీద పరిస్థితులేమిటో మనకంతగా తెలియదు. అసలు మన చంద్రయాన్‌-2ను పైకి పంపుతున్నదే అక్కడి పరిస్థితులెలా ఉన్నాయో తెలుసుకునేందుకు. కానీ మనం పంపే యంత్ర పరికరాలు మాత్రం అక్కడి వాతావరణాన్ని తట్టుకుని.. సమర్థంగా పని చెయ్యాలి! ఇదే మన ఇస్రో శాస్త్రవేత్తల ముందున్న పెద్ద సవాల్‌! అందుకే చంద్రుడి మీదకు పంపుతున్న ల్యాండర్‌, రోవర్లను బోలెడన్ని క్లిష్టమైన పరీక్షలకు గురిచేశారు. చంద్రుడి మీది పరిస్థితులను భూమ్మీదే కృత్రిమంగా సృష్టించి.. అక్కడ మన యంత్రాలకు ఎదురయ్యే సవాళ్లేమిటి? వాటిని అధిగమించేందుకు చంద్రయాన్‌ను ఎలా సన్నద్ధం చెయ్యాలన్నది లోతుగా పరిశీలించారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి!


మహా సంక్లిష్టం.. ఈ చంద్ర యాత్ర!

మానవ మేధస్సుకు పట్టం కట్టే మహోజ్జ్వల ఘట్టానికి తెర లేస్తోంది! ఒకప్పుడు రాత్రయిందంటే చాలు.. సుదూర తీరంలో ఊరిస్తూ, ఉడికిస్తుండే చందమామ గురించి ఏవేవో కథలు చెప్పుకోవçమే తప్పించి అసలక్కడికి ఓ బుజ్జి యంత్రాన్ని పంపించి బోలెడంత సమాచారం సేకరించొచ్చన్నది ఊహించటమే కష్టం. ఇప్పుడీ కలలను నిజం చేయబోతోంది మన ఇస్రో! నిజానికి ఇస్రో ఈ నెల 14 అర్ధరాత్రి దాటాక ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభమవుతున్న చంద్రయాన్‌-2 యంత్ర యాత్ర... అంతరిక్ష చరిత్రలో అత్యంత సంక్లిష్టమైన, కష్టసాధ్యమైన ప్రయోగమని చెప్పుకోక తప్పదు! ఎందుకో చూద్దాం! పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి!


అదిగదిగో.. మామ ఇంటిని చూసివద్దామా!

ఆకాశం ఓ ప్రహేళిక! విశ్వం.. ఓ విస్మయాల పుట్ట!! సుదూర వినీలాకాశంలో చండ్రనిప్పులు కురిపించే ఆ సూర్యుడేమిటి? నిగూఢ నిశిరాత్రి సైతం పండు వెన్నెలలు కురిపించే ఆ చంద్రుడేమిటి? ఈ విశ్వాంతరాళంలో మనిషిని కొన్ని యుగాల పాటు వేధించిన ప్రశ్నలివి. ఎంతో ఉత్సుకత రేకెత్తించిన విశ్వ సందేహాలివి. ..అందుకే ఈ సుదీర్ఘ మానవ ప్రస్థానంలో మనిషి వీటి గురించి పలు విధాల ఆలోచనలు చేశాడు. రకరకాల సమాధానాలు వెతుక్కున్నాడు. చల్లదనాల చంద్రబింబంలో ఆత్మీయతను పంచే మేన‘మామ’ను చూసుకున్నాం. అందులోనే ఆశ్చర్యాన్ని పెంచే పేదరాసి పెద్దమ్మను గుర్తించాం. అయితే.. మన మనసులకు ఎంత దగ్గరైనా నేటికీ మన ‘మామ’ గురించి మనకు తెలిసింది తక్కువే. నిన్న మొన్నటి వరకూ మనకు కనీసం అక్కడ నీళ్లున్నాయో లేదో కూడా అయోమయమే. మనిషి అక్కడకు వెళితే ఆదరణ ఉంటుందో లేదో తెలీదు. అందుకే మన అన్వేషణ నేటికీ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో వేస్తున్న మరో అడుగే చంద్రయాన్‌-2. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి!


పసిగడతాయ్‌.. సమాచారమిస్తాయ్‌ 

చంద్రయాన్‌-2లోని ఆర్బిటర్‌, ల్యాండర్‌, రోవర్‌లలో పరిశోధనల కోసం 13 పరికరాలు ఉన్నాయి. ఇవన్నీ దేశీయంగా రూపొందించినవే. ఈ ఉపకరణాలు ప్రధానంగా జాబిల్లిపై నీటి జాడను అన్వేషిస్తాయి. ఖనిజాలు, ఉష్ణోగ్రతలకు సంబంధించిన డేటాతోపాటు అక్కడి బిలాలు, మూలకాలు, ఖనిజాల తీరును విశ్లేషిస్తాయి. త్రీడీ మ్యాప్‌లను రూపొందిస్తాయి. భవిష్యత్‌ అవసరాల కోసం ఉపయోగపడే డేటాను అందిస్తాయి. వీటికితోడు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసాకు చెందిన లేజర్‌ సాధనం కూడా వ్యోమనౌకలో ఉంది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి!


మలుపు మలుపులో సవాళ్లు

జాబిల్లిపై యంత్ర దూతను దింపడం ఓ అద్భుత ఘనత. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా మాత్రమే దాన్ని సాధించగలిగాయి. అన్నీ అనుకున్నట్లు జరిగి చంద్రయాన్‌-2 తన గమ్యాన్ని చేరుకోగలిగితే త్వరలో భారత్‌ కూడా ఈ జాబితాలో చోటు సంపాదిస్తుంది. అంతేకాదు.. చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో వ్యోమనౌకను దింపిన తొలి దేశంగా రికార్డు పుటల్లో స్థానం దక్కించుకుంటుంది. వినడానికి ఉత్తేజభరితంగానే ఉన్నప్పటికీ జాబిల్లిపైకి వ్యోమనౌకను చేర్చడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. అందుకోసం అనేక సవాళ్లు, సాంకేతిక ఇబ్బందులను అధిగమించాల్సి ఉంటుంది. దిగిన తర్వాతా ఇబ్బందులు ఎదురుకావొచ్చు. అనేక అంశాలపై భారీగా లెక్కలుకట్టి.. అత్యంత కచ్చితత్వం సాధిస్తేనే అనుకున్న రీతిలో ప్రాజెక్టు విజయవంతమవుతుంది. ‘చంద్రయాన్‌-2’ విషయంలో అలా ఎదురయ్యే సవాళ్లేంటంటే.. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి!


ఆది నుంచీ జాప్యాలే 

ప్రతిష్ఠాత్మక ‘చంద్రయాన్‌-2’కు ఆది నుంచీ జాప్యాలు తప్పలేదు. ఈ ప్రాజెక్టుకు 2008 సెప్టెంబర్‌ 18న నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ ప్రయోగం కోసం రష్యాతో కలసి పనిచేయాలని అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తొలుత భావించింది. దానిప్రకారం ఆర్బిటర్‌, రోవర్‌ను ఇస్రో రూపొందించాలి. ల్యాండర్‌ను రష్యా సరఫరా చేస్తుంది. 2013లో చంద్రయాన్‌-2ను ప్రయోగించాలని తొలుత భావించారు. అయితే వరుస ఇబ్బందులతో ఈ ప్రాజెక్టు ఏళ్ల తరబడి వాయిదాలు పడుతూ వచ్చింది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి!


 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.