close

తాజా వార్తలు

అప్పటిదాకా సూపర్‌ ఓవర్‌ ఆడించాలి

బౌండరీల నిబంధనపై మాజీల ఏమన్నారంటే?

లండన్‌: ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌ X న్యూజిలాండ్‌ జట్లు సమాన స్కోర్‌ సాధించినప్పటికీ ఎక్కువ బౌండరీలు బాదారన్న నియమం ప్రాకారం ఆతిథ్య జట్టు తొలిసారి విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నిబంధనపై సామాన్య క్రీడాభిమానులతో  పాటు పలువురు క్రికెటర్లు పెదవి విరుస్తున్నారు. మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 17 బౌండరీలు బాదగా ఇంగ్లాండ్‌ 24 బౌండరీలు సాధించింది. దీంతో ఆ జట్టే కొత్త విజేతగా అవతరించింది. ఈ విషయంపై పలువురు మాజీలు ట్విటర్‌లో స్పందించారు.  

మాజీల స్పందన:

* క్రికెట్‌లోని కొన్ని నియమాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉంది -రోహిత్‌శర్మ
* ఉన్నట్టుండి చనిపోయినట్టు.. బౌండరీల పరంగా విజేతని నిర్ణయించే నియమం జీర్ణించుకోడానికి కష్టంగా ఉంది. స్పష్టమైన ఫలితం వచ్చేవరకు సూపర్‌ ఓవర్లు కొనసాగించినా, అర్థం చేసుకునే విధంగా ఇద్దరినీ విజేతగా ప్రకటించినా ఇంకా బాగుండేది. న్యూజిలాండ్‌కు ఈ ఫలితం కష్టతరంగా ఉంటుంది. -మాజీ క్రికెటర్‌ మహ్మద్‌కైఫ్‌
*ఈ నియమంతో ఏకీభవించలేను కానీ నియమాలను పాటించక తప్పదు. ఎట్టకేలకు జగజ్జేతగా నిలిచినందుకు అభినందనలు. న్యూజిలాండ్‌ జట్టుకు విచారం వ్యక్తం చేస్తున్నా. అద్భుతమైన మ్యాచ్‌ అత్యద్భుతమైన ఫైనల్‌. -మాజీ క్రికెటర్‌ యువరాజ్‌సింగ్‌
*ఇంగ్లాండ్‌కు అభినందనలు. న్యూజిలాండ్‌కు సానుభూతి తెలియజేస్తున్నా. విజేతని ఇలా నిర్ణయించడం దారుణంగా ఉందనిపిస్తుంది. ఈ నియమాన్ని మార్చాల్సిన అవసరముంది. -మాజీ బౌలర్‌ బ్రెట్‌లీ
*టైగా మారిన మ్యాచ్‌లో ఎక్కువ వికెట్లు తీసిన పద్ధతి కాకుండా ఎక్కువ బౌండరీల పరంగా విజేతని ప్రకటించే నియమం వెనుకున్న అంతరార్ధం ఏమిటో వినాలని ఉంది. -రచయిత ఆండ్రూ ఫిడేల్‌ ఫెర్నాండో


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.