close

తాజా వార్తలు

జగన్‌ తన చెట్టును తానే నరుక్కుంటున్నారు

చంద్రబాబు

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ తన చెట్టును తానే నరుక్కుంటున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో సీబీఐ విచారణ కావాలని ఎంపీ విజయసాయిరెడ్డి అడిగితే, అవసరం లేదన్నట్లు ఓ కేంద్ర మంత్రి చెప్పారని గుర్తు చేశారు. అసెంబ్లీ లాబీల్లో చంద్రబాబు మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పోలవరానికి ఫైనాన్స్‌ క్లియరెన్స్‌ రాకపోవడంతోపాటు ఆర్‌అండ్‌ఆర్‌ రాష్ట్ర పరిధిలోనిదేనని కేంద్రం అంటోదని, ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం..వైకాపా మాట్లాడటం లేదని మండిపడ్డారు. పట్టిసీమ నీళ్లు మచిలీపట్నానికే ఉపయోగపడట్లేదని అంటున్నారని, గోదావరికే కృష్ణా నీళ్లు తీసుకెళ్లినట్లు వైకాపా మాట్లాడుతోందని చంద్రబాబు ఆక్షేపించారు.
 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.