Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 127272
            [news_title_telugu_html] => 

బండి వాడుతున్నావుగా.. డబ్బుకట్టు..!

[news_title_telugu] => బండి వాడుతున్నావుగా.. డబ్బుకట్టు..! [news_title_english] => Govt diverting around Rs 17000 crore from petrol and diesel cess kitty [news_short_description] => ప్రభుత్వం ఒక లక్ష్యం కోసం వాహనదారుల ముక్కు పిండి వసూలు చేస్తున్న సొమ్మును ఇతర అవసరాల కోసం మళ్లిస్తోంది. ... [news_tags_keywords] => petrol,diesel,cess [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-07-17 01:05:02 [news_isactive] => 1 [news_status] => 2 ) )
బండి వాడుతున్నావుగా.. డబ్బుకట్టు..! - Govt diverting around Rs 17000 crore from petrol and diesel cess kitty - EENADU
close

తాజా వార్తలు

బండి వాడుతున్నావుగా.. డబ్బుకట్టు..!

 వాహనదారుడి పై భారం ఇలా..

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభుత్వం ఒక లక్ష్యం కోసం వాహనదారుల ముక్కు పిండి వసూలు చేస్తున్న సొమ్మును ఇతర అవసరాల కోసం మళ్లిస్తోంది. పెట్రోల్‌, డీజిల్‌పై ప్రభుత్వం సెస్సు రూపంలో వసూలు చేస్తున్న సొమ్ము నుంచి 2018-19,2019-20లలో రూ.17,000  కోట్లు ఇతర మార్గాలకు మళ్లించింది. దీనికి తోడు తాజా బడ్జెట్‌లో ప్రభుత్వం ఇంధనంపై మరో రూ.1 సెస్సును పెంచింది. ఈ సొమ్ము మొత్తం ది సెంట్రల్‌ రోడ్‌ అండ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌కు మళ్లుతాయి. సెస్సు పెంచక ముందు 2018-19లో రూ.1.13లక్షల కోట్లు, 2019-20లో 1.27లక్షల కోట్లు వస్తాయని అంచనా. వచ్చే మొత్తం ఈ ఫండ్‌కు జమకావడంలేదు. 2018-19లో రూ.9,013 కోట్లు మళ్లించగా, 2019-20లో 7,920 కోట్లు మళ్లిస్తారని అంచనా. కచ్చితంగా వీటిని ఎటు మళ్లించారనే విషయాన్ని పేర్కొనలేదు. నవోదయ పాఠశాలలకు కూడా ప్రభుత్వం వీటి నుంచి రూ.2,926 కోట్లను కేటాయించింది. 

మరోపక్క నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియాకు నిధుల కొరత తీవ్రంగా ఉంది. ఇంజినీరింగ్‌, కొనుగోళ్లు, నిర్మాణ ఖర్చలు విపరీతంగా పెరిగిపోయాయి. హైవేల నిర్మాణం కోసం రహదారుల మంత్రిత్వ శాఖ ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. వారికి కాంట్రాక్టును బిల్డ్‌, ఆపరేట్‌, ట్రాన్సఫర్‌, మెయింటనెన్స్‌ పద్ధతిలో అందజేస్తోంది. ఫలితంగా రహదారులు నిర్మించినా మళ్లీ టోల్‌ట్యాక్స్‌ల రూపంలో వాహనదారుల జేబులకు చిల్లుపడుతోంది.  ఇది చాలాదన్నట్లు ఇటీవల బడ్జెట్‌లో సెస్సు, సర్‌ఛార్జీలు కలిపి పెట్రోల్‌, డీజిల్‌పై రూ.2కు పైగా పెంచారు. దీనిలో సర్‌ఛార్జి రూపంలో వచ్చే మొత్తాన్ని ప్రభుత్వం తనకు నచ్చిన పనులకు కేటాయించవచ్చు. 

భారం ఇలా..

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై వసూలు చేస్తున్న పన్నుల మొత్తం రూ.19.98 నుంచి రూ.21.16గా ఉంది. ఇక డీజిల్‌పై మొత్తం ఎక్సైజ్‌డ్యూటీ రూ.15.83  ఉండగా.. బ్రాండెడ్‌ డీజిల్‌పై 18.19 ఉంది. ప్రతిలీటర్‌ ఇంధన విక్రయం నుంచి ప్రభుత్వానికి మౌలిక వసతుల కల్పనకు (ఇన్ఫ్రాస్ట్రక్చర్‌)కు రూ.9 వస్తున్నాయి. 

వాజ్‌పేయి ప్రారంభించి..

1998లో నాటి ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి తొలిసారి పెట్రోల్‌పై రోడ్డు సెస్సును ప్రవేశపెట్టారు. ఆ తర్వాతి సంవత్సరం దీనిని డీజిల్‌కు కూడా విస్తరించారు. ఈ నిధులను రహదారుల నిర్మాణానికి వెచ్చించాలని నిర్ణయించారు. మోదీ ప్రభుత్వం వచ్చాక ది సెంట్రల్‌ రిజర్వు ఫండ్‌ యాక్ట్‌ను సవరించి ఈ నిధికి సెంట్రల్‌రోడ్‌ అండ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌గా పేరు మార్చారు. దీని ప్రకారం రోడ్‌సెస్‌ తొలుత భారత ఏకీకృత నిధికి జమ అవుతుంది. ఆ తర్వాత చిన్న సవరణలతో సీఆర్‌ఐఎఫ్‌కు మళ్లిస్తారు. దీంతోపాటు డీజిల్‌పై వసూలు చేసే సగం సెస్సును గ్రామీణ ప్రాంతాల రోడ్లకు వినియోగించనున్నారు.  ఇక పెట్రోల్‌, డీజిల్‌పై  వసూలయ్యే సెస్సులో.. 57.5శాతం రహదారుల నిర్వహణకు, అభివృద్ధికి, 12.5శాతం రైల్వే అండర్‌,వోవర్‌ బ్రిడ్జిల నిర్మాణానాకి, 30శాతం రహదారుల భద్రతకు మళ్లించనున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.