close

తాజా వార్తలు

ట్రై సిరీస్‌లో ఆడబోం: జింబాబ్వే బోర్డు

మా ఆటగాళ్లు మళ్లీ ఆడితే చూడాలని ఉంది

హరారె: బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ క్రికెట్‌ జట్లతో కలిసి సెప్టెంబర్‌లో ఆడాల్సిన టీ20 ట్రై సిరీస్‌లో తమ ఆటగాళ్లు పాల్గొనబోరని జింబాబ్వే క్రికెట్‌ బోర్డు వెల్లడించింది. అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ గురువారం జింబాబ్వేను క్రికెట్‌ నుంచి సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఐసీసీ రాజ్యాంగానికి విరుద్ధంగా ఆ దేశ క్రికెట్‌ వ్యవహారాల్లో అక్కడి ప్రభుత్వం జోక్యం చేసుకోవడమే అందుకు కారణం. ఐసీసీ చర్యలపై ఆగ్రహించిన జింబాబ్వే బోర్డు తాజా నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌లతో కలిసి ఆడాల్సిన టీ20 ట్రై సిరీస్‌ను రద్దు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే భవిష్యత్‌లోనూ జింబాబ్వే ఆడాల్సిన అన్ని రకాల టోర్నీలను రద్దు చేసుకున్నామని ఆ బోర్డు స్పష్టం చేసింది. మరోవైపు ఐసీసీతో సఖ్యతగా వ్యవహరించి యథాతథంగా తమ కార్యకలాపాలను కొనసాగించాలనుకుంటున్నామని, అలాగే ఎంత వీలైతే అంత తొందరగా తమ ఆటగాళ్లు మళ్లీ క్రికెట్‌ ఆడితే చూడాలని ఉందని ఆ దేశ క్రికెట్‌ బోర్డు వెల్లడించింది. 

.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.