close

తాజా వార్తలు

రాయుడు విఫలమైనా నమ్మకం ఉంచాం.. కానీ

ముంబయి: అనూహ్యంగా రిటైర్మెంట్‌ ప్రకటించిన రాయుడిపై టీమిండియా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించారు. ఆటగాళ్లకు ఉండే భావోద్వేగాలే సెలక్షన్‌ కమిటీకి ఉంటాయని, అన్నింటికీ అతీతంగా ప్రపంచకప్‌కు జట్టును ఎంపిక చేశామని పేర్కొన్నారు. వెస్టిండీస్‌ పర్యటనకు భారత్‌ జట్లను ఎంపిక చేసిన అనంతరం ఎమ్మెస్కే ప్రసాద్‌ విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

‘ఆటగాళ్లకు ఉన్న భావోద్వేగాలే సెలక్షన్‌ కమిటీకి ఉంటాయి. ఎంపిక చేసిన ఆటగాడు రాణిస్తే మేం ఎంతో ఆనందిస్తాం. అదేవిధంగా ఎవరైనా భావోద్వేగాలతో జట్టుకు దూరమైతే వారి కోసం బాధపడతాం. ఎటువంటి పక్షపాతం, అభిమానం లేకుండా ప్రపంచకప్‌ జట్టును ఎంపిక చేశాం. విజయ్‌ శంకర్‌, రిషబ్‌ పంత్, మయాంక్‌ అగర్వాల్‌కు ఎందుకు అవకాశం దక్కిందో వివరణ ఇచ్చాం. రాయుడు విషయంలోనూ వివరించాం.’ అని పేర్కొన్నారు.

‘‘ఆ ట్వీట్‌ను నేను ఎంతో ఆనందించాను. సమయానికి తగ్గట్టుగా స్సందించాడు. ఇది అద్భుతం. ఇది అతనికి ఎలా తాకిందో తెలియదు.’’ (త్రీడీ ట్వీట్‌ గురించి స్పందిస్తూ) 

‘టీ20లో చూపించిన ప్రతిభ ఆధారంగా వన్డేలకు రాయుడును ఎంపిక చేశామని విమర్శలు వచ్చాయి. కానీ అతనిపై మాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఫిట్‌నెస్‌ పరీక్షలో విఫలమైనా అతనిపై నమ్మకం ఉంచాం. పూర్తి ఫిటెనెస్‌తో భారత్‌ తరఫున అతను ఆడాలని భావించి తగిన ఏర్పాట్లు కూడా చేశాం. కానీ కొన్ని కారణాల వల్ల అతను ప్రపంచకప్‌కు ఎంపిక కాలేదు. అంతేకానీ సెలక్షన్‌ కమిటీ ఎటువంటి పక్షపాతంతో నిర్ణయాలు తీసుకోలేదు.’ అని తెలిపారు.

ఆగస్టు 3 నుంచి ప్రారంభమయ్యే వెస్టిండీస్ పర్యటనకు సెలక్టర్లు యువఆటగాళ్లకు పెద్దపీట వేశారు. నాలుగో స్థానంలో ఉన్న సమస్యను భర్తీచేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌పాండే, రిషభ్‌పంత్‌కు అవకాశం ఇచ్చారు. బౌలింగ్‌లో ఖలీల్‌అహ్మద్‌, నవదీప్‌సైనీ, దీపక్‌ చాహర్‌, రాహుల్‌ చాహర్‌, వాషింగ్టన్‌ సుందర్‌ను ఎంపిక చేశారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.