close

తాజా వార్తలు

‘స్కార్పియో’ అని పలకడం వచ్చా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా సామాజిక మాధ్యమాల్లో ఏ విషయంలోనైనా చురుగ్గా ప్రతిస్పందిస్తుంటారు. ఈ మధ్యకాలంలో టిక్‌టాక్‌లో (wrong english pronounciation challenge) అనే ఛాలెంజ్‌ వైరల్‌గా మారింది. ఈ ఛాలెంజ్‌ ఏమిటంటే ఒక ఆంగ్ల పదాన్ని తీసుకుని కొందరు వ్యక్తులు ఒక్కొక్క అక్షరం పలుకుతూ.. మొత్తంగా ఆ పదాన్ని తప్పు అర్థం వచ్చేవిధంగా పలకడం దీని ఉద్దేశం. అలా ఈ సవాలులో భాగంగా కొందరు వ్యక్తులు మహీంద్రా సంస్థకు చెందిన ఒక కారు నంబర్‌ ప్లేటుపై ఉన్న స్కార్పియో అనే పదాన్ని హాస్యాస్పదంగా ఉచ్ఛరించారు. ఆ వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేయగా అది కాస్త వైరల్‌గా మారి ఆనంద్‌ మహీంద్రా కంట పడింది. 
దీంతో ఆయన దానికి ప్రతిస్పందిస్తూ.. ఈ ఛాలెంజ్‌లో భాగంగా తమ సంస్థకు చెందిన వాహనం స్కార్పియో అందులో పేరు సంపాదించుకుందన్న విషయం తనకు ఇప్పటివరకు తెలియలేదని చమత్కరించారు. నాకు ఈ ఆదివారం ఆ హాస్యాస్పద వీడియోతోనే ప్రారంభమైందన్నారు. ఈ రోజు ఉదయాన్నే నేను దాన్ని చూసిన తర్వాత నవ్వు ఆపుకోలేకపోయానని పేర్కొన్నారు. మహీంద్రా కామెంట్‌తో ఆ పోస్ట్‌ వైరల్‌గా మారింది. అతను చమత్కారంగా ఇచ్చిన కామెంట్‌ను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.