close

తాజా వార్తలు

విక్రమ్‌ అండగా జాబిల్లిపై చేరనున్న ప్రజ్ఞాన్‌

బెంగళూరు: దేశం ఉత్కంఠగా ఎదురుచూసిన చంద్రయాన్‌-2 ప్రయోగం విజయవంతమైంది. ఉపగ్రహం దాదాపు 3 లక్షల కి.మీ.కుపైగా పయనించి చంద్రగ్రహాన్ని చేరనుంది. చంద్రుని కక్ష్యకు చేరుకున్న అనంతరం ఉపగ్రహం నుంచి లాండర్‌ విడిపోనుంది. ఈ లాండర్‌కు విక్రమ్‌ అనే పేరు పెట్టారు. ఇస్రో వ్యవస్థాపకుడు, ప్రఖ్యాత అంతరిక్ష శాస్త్రవేత్త విక్రమ్‌ సారాభాయ్‌ పేరును లాండర్‌కు పెట్టారు. చంద్రయాన్‌  చంద్రుని కక్ష్య చేరేందుకు 45 రోజుల సమయం పట్టనుందని శాస్త్రవేత్తలు తెలిపారు. సెప్టెంబరు 7న  విక్రమ్‌ లాండ్‌ అయిన అనంతరం దాని నుంచి ప్రజ్ఞాన్‌ అనే రోవర్‌ చంద్రునిపై పరిశోధనలు నిర్వహించనుంది. 

తక్కువ బడ్జెట్‌తో..
చంద్రయాన్‌-2కు రూ.1000 కోట్ల కన్నా తక్కువ బడ్జెట్‌ను కేటాయించారు. అమెరికా అంతరిక్ష ప్రయోగసంస్థ నాసా కన్నా ఇస్రో బడ్జెట్ చాలా తక్కువ. అయినా అగ్రరాజ్యాలకు దీటుగా ఇస్రో అంతరిక్ష ప్రయోగాలు నిర్వహిస్తోంది.

చంద్రునిపై ఇతర దేశాలకు భిన్నంగా..
చంద్రునిపై ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనాలు ఉపగ్రహాలను ప్రయోగించాయి. భారత్‌ నాలుగోదేశంగా నిలిచింది. అయితే అమెరికా అంతరిక్షనౌకలు చంద్రుని మధ్యప్రాంతంలో ల్యాండ్‌కాగా  రష్యా, చైనాలు ఆ గ్రహం ఉత్తరభాగంలో పరిశోధనలు జరిపాయి. అయితే భారత్‌ ఇందుకు భిన్నంగా దక్షిణ ప్రాంతాన్ని ఎంచుకొంది. ఈ ప్రాంతంలో ఇప్పటివరకు ఎలాంటి పరిశోధనలు జరగలేదు. ఇక్కడ ఎక్కువభాగం ఛాయలోనే ఉంటుంది. దీంతో ఇక్కడ నీటి వనరులు ఉండే అవకాశముందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రజ్ఞాన్‌ రోవర్‌ తన పరిశోధనలను ఫొటోలు తీసి ఎప్పటికప్పుడు ఇస్రోకు పంపిస్తుంది.అక్కడ ఉన్న ఖనిజాల నిల్వలు, వాతావరణం.. తదితర అంశాల గురించి పరిశోధన నిర్వహించనుంది. దీని ద్వారా చంద్రుని ఆవిర్భావం, పరిణామక్రమం..తదితర అంశాల గురించి తెలుసుకునే అవకాశముంది.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.