close

తాజా వార్తలు

ఎమ్మెస్కే వివరణ అంగీకరించని అజ్జూభాయ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: హైదరాబాదీ క్రికెటర్‌ అంబటి రాయుడు పట్ల బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ వ్యవహార శైలి అస్సలు బాగాలేదని టీమిండియా మాజీ సారథి మహ్మద్‌ అజహరుద్దీన్‌ అన్నారు. రాయుడి నిష్ర్కమణపై చీఫ్ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ ఇచ్చిన వివరణను ఆయన అంగీకరించలేదు. ప్రపంచకప్‌ జట్టులో ఎవరైనా గాయపడితే స్టాండ్‌బైగా ఉన్న ఆటగాడినే ఎంపిక చేయాలి కదా అని ప్రశ్నించారు. 2019 జనవరి వరకు రాయుడిని టీమిండియాలో క్రమం తప్పకుండా నాలుగో స్థానంలో ఆడించారు. అతడికి ప్రపంచకప్‌ ఆశలు కల్పించారు. చివరికి మూడు కోణాల్లో ఉపయోగపడతాడని అతడి బదులు విజయ్‌ శంకర్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. దీనిపై వివాదం చెలరేగడంతో రాయుడిని స్టాండ్‌బైగా ప్రకటించారు. ధావన్‌, విజయ్‌ శంకర్ గాయపడితే పంత్‌, మయాంక్‌ను ఇంగ్లాండ్‌కు పంపించారు. రాయుడికి మళ్లీ మొండిచేయి చూపించారు. మనస్తాపానికి గురైన అతడు ప్రపంచకప్‌ జరుగుతుండగానే ఆటకు శాశ్వతంగా వీడ్కోలు పలికేశాడు.

ఆటగాళ్లు ఎలాంటి భావోద్వేగానికి గురవుతారో సెలక్షన్‌ కమిటీ అంతే భావోద్వేగం చెందుతుంది. మా ఎంపికలో వివక్ష లేదు. జట్టు అవసరాల మేరకే విజయ్‌ శంకర్‌, రిషభ్‌పంత్‌, మయాంక్‌ అగర్వాల్‌ను ఎంపిక చేశాం.

- ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత ఎమ్మెస్కే వివరణ

రాయుడి అంశంపై అజాహరుద్దీన్‌ ఇప్పుడు స్పందించారు. ఏ టోర్నీలోనైనా సరే ఆటగాడు గాయపడితే స్టాండ్‌బైగా ఉన్నవారికే అవకాశం ఇవ్వాలని అజ్జూ స్పష్టం చేశారు. ‘ఒక ఆటగాడు స్టాండ్‌బైగా ఉంటే, జట్టులో మరొకరు గాయపడితే అతడి స్థానంలో స్టాండ్‌బైకే అవకాశం ఇవ్వాలి. కోచ్‌, సారథి నిర్ణయాన్ని సెలక్టర్లు వ్యతిరేకించవచ్చు. కాలు అడ్డంపెట్టి మేం అతడినే పంపిస్తామని నిక్కచ్చిగా చెప్పొచ్చు. సారథిగా ఉన్నప్పుడు నేనూ కొంత మంది ఆటగాళ్లు కావాలని అడిగాను. కానీ సెలక్టర్లు కుదరదని చెప్పేశారు. అలా చేయొచ్చు. మీరు ఎంపిక చేయకపోవడం ఎంతో బాధాకరం. మొత్తానికి అలా జరిగిపోయింది. కానీ ఆయన (ఎమ్మెస్కే ప్రసాద్‌) వివరణను నేను అంగీకరించను’ అని అజహరుద్దీన్‌ చెప్పారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.