close

తాజా వార్తలు

ఐటీ రిటర్నుల దాఖలు గడువు పెంపు!

న్యూదిల్లీ: ఆదాయపు రిటర్నులు దాఖలు చేసే వారికి శుభవార్త. 2018-19 సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించడానికి గడువు తేదీని ప్రభుత్వం ఆగస్టు 31వ తేదీ వరకూ పొడిగించింది. సాధారణంగా గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించడానికి చివరి తేదీ జులై 31. ఇప్పుడు ఆ గడువు మరో నెలరోజులు పెంచింది. ‘ఆదాయపు పన్ను రిటర్నుల సమర్పణ గడువు తేదీని జులై 31, 2019 నుంచి ఆగస్టు 31, 2019 వరకూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) పెంచింది. వివిధ కేటగిరీలకు చెందిన పన్ను చెల్లింపుదారులు ఆ తేదీలోగా రిటర్నులను సమర్పించాల్సి ఉంటుంది’ అని ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఐటీఆర్‌ సమర్పణ గడువు తేదీని పెంచాలని వచ్చిన డిమాండ్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు చివరి నిమిషం వరకూ వేచి చూడకుండా.. రిటర్నులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ గడువు దాటిన తర్వాత కూడా రిటర్నులు దాఖలు చేయొచ్చు. దీనికిగాను కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబరు 31, 2019 వరకూ అయితే రూ.5,000. ఆ తర్వాత రిటర్నులు దాఖలు చేయడానికి చివరి తేదీ.. మార్చి 31, 2020. దీనికోసం రూ.10,000 చెల్లించాలి. 

రిటర్నులు దాఖలు చేయడం వల్ల ఉపయోగాలేంటి?


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.