Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 142993
            [news_title_telugu_html] => 

ఆ రేఖ తిరగబడితే.. ప్రపంచం గజగజ..!

[news_title_telugu] => ఆ రేఖ తిరగబడితే.. ప్రపంచం గజగజ..! [news_title_english] => What is an inverted yield curve and why does it matter [news_short_description] => ముంచుకొస్తున్న ప్రపంచ ఆర్థిక సంక్షోభం..  ఇదీ ఇటీవల కాలంలో చాలా మంది ఆర్థిక విశ్లేషకుల నోటి నుంచి వస్తున్న మాట. ఆర్థిక సంక్షోభ భయాలు మార్కెట్‌ను చుట్టు ముట్టినప్పుడల్లా ఒక రేఖ గురించి తీవ్రమైన చర్చ మొదలవుతుంది. అదే ‘ఈల్డ్‌ కర్వ్’‌..! అసలు ఈల్డ్‌కర్వ్‌ ఏమిటీ..? అది తిరగబడటం ఏమిటీ అనుకుంటున్నారా..?ఇది తెలుసుకోవాలంటే సంక్షిప్తంగా బాండ్స్‌ గురించి కూడా తెలుసుకోవాలి.  [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-18 00:22:46 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఆ రేఖ తిరగబడితే.. ప్రపంచం గజగజ..! - What is an inverted yield curve and why does it matter - EENADU
close

తాజా వార్తలు

ఆ రేఖ తిరగబడితే.. ప్రపంచం గజగజ..!

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: ముంచుకొస్తున్న ప్రపంచ ఆర్థిక సంక్షోభం..  ఇదీ ఇటీవల కాలంలో చాలా మంది ఆర్థిక విశ్లేషకుల నోటి నుంచి వస్తున్న మాట. ఆర్థిక సంక్షోభ భయాలు మార్కెట్‌ను చుట్టు ముట్టినప్పుడల్లా ఒక రేఖ గురించి తీవ్రమైన చర్చ మొదలవుతుంది. అదే ‘ ఇన్వర్టెడ్‌ ఈల్డ్‌ కర్వ్’‌.. ! ఇది ఆగస్టు 14న అమెరికా మార్కెట్లలో కనిపించింది. అసలు ఈల్డ్‌కర్వ్‌ ఏమిటీ..? అది తిరగబడటం ఏమిటీ అనుకుంటున్నారా..?ఇది తెలుసుకోవాలంటే సంక్షిప్తంగా బాండ్స్‌ గురించి కూడా తెలుసుకోవాలి. 

బాండ్స్‌ అంటే..
ప్రజల వద్ద నుంచి రుణం సేకరించడానికి ప్రభుత్వం లేదా కార్పొరేట్‌ సంస్థలు జారీ చేసే చట్టబద్దమైన హామీ పత్రాన్ని బాండ్స్‌ అనవచ్చు. వీటిని మనం అవసరాలను బట్టి మార్కెట్లో విక్రయించవచ్చు కూడా..! ఈ బాండ్స్‌పై  ప్రభుత్వం లేదా కార్పొరేట్‌ సంస్థలు ఏటా ఇచ్చే వడ్డీ ఆదాయాన్ని ‘ఈల్డ్‌’(రాబడి)అంటారు. మెచ్యూరిటీ తేదీ తర్వాత అసలు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇవి రుణదాతలకు స్థిరమైన ఆదాయాన్ని ఇస్తాయి. ఇవి కేంద్ర బ్యాంకులు చెల్లించే వడ్డీరేట్ల ఆధారంగా మార్కెట్లో బాండ్ల ధరలు మారుతూ ఉంటాయి. 

ఈల్డ్‌కర్వ్‌(రాబడి రేఖ) ఏమిటీ..?

సాధారణంగా స్వల్పకాలిక బాండ్లకు తక్కువ ఈల్డ్‌ లభిస్తుంది. దీర్ఘకాలిక బాండ్లకు ఎక్కువ రాబడి లభిస్తుంది. ఉదాహరణకు: 2 సంవత్సరాల మెచ్యూరిటీ ఉన్న బాండ్లపై 3శాతం రాబడి లభిస్తే.. 4 సంవత్సరాల కాల వ్యవధి ఉన్న బాండ్లపై 5శాతం రాబడి.. 6 సంవత్సరాల బాండ్లపై 7శాతం  ఈల్డ్‌ లభిస్తోందని అనుకుందాం. ఇలా ఉంటే ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగా ఉన్నట్లు ఆర్థిక విశ్లేషకులు చెబుతుంటారు. దీనిని మనం ఒక ఛార్ట్‌పై రేఖా చిత్రం గీస్తే నెలవంకను తిరగేసిన ఆకారంలో ఉంటుంది. దీనిని ఈల్డ్‌కర్వ్‌ అంటారు. 

ఇన్వర్టెడ్‌ ఈల్డ్‌కర్వ్‌ అంటే..

సాధారణం కంటే భిన్నంగా స్వల్పకాలిక బాండ్ల ప్రతిఫలాలు.. దీర్ఘకాలిక బాండ్ల రాబడి కంటే ఎక్కువగా ఉండటాన్ని ఇన్వర్టెడ్‌ ఈల్డ్‌కర్వ్‌ అంటారు. దీనిని రేఖా చిత్రంగా గీస్తే నెలవంక ఆకారంలో ఉంటుంది. దీనికి ప్రభుత్వ నిర్ణయాలు ప్రధాన కారణంగా నిలుస్తాయి. బాండ్ల పరిస్థితి ఇలా ఉన్న ప్రతిసారి ప్రపంచం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. అందుకే ఇప్పుడు విశ్లేషకులు భయపడుతున్నారు. 

కారణాలు ఇవీ..

స్వల్పకాలిక బాండ్ల ప్రతిఫలాలు పెరగటానికి ప్రధానంగా వడ్డీరేట్లు కారణమవుతాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇరుసు వంటి అమెరికా మార్కెట్‌ స్థిరంగా పెరుగుతూ.. నిరుద్యోగ రేటు స్థిరంగా తగ్గుతోంది. దీంతో ఆ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నట్లు లెక్క. ఇది ఒక దశకు వచ్చాక నిలిచిపోతుంది. ఇక్కడ ఫెడ్‌ రంగంలోకి దిగుతుంది. ఆ సమయంలో  స్వల్పకాలిక వడ్డీరేట్లను పెంచుతోంది. దీంతో ప్రజలు దీర్ఘకాలిక బాండ్ల నుంచి సొమ్మును తీసి మార్కెట్ల వైపు మళ్లుతారు. 

ఈ సమయంలో వారు దీర్ఘకాలిక బాండ్లను తక్కువ ధరకు మార్కెట్లో విక్రయిస్తారు. తక్కువ ధరకు లభించే బాండ్లకు.. ధరతో పోలిస్తే రాబడి ఎక్కువగానే ఉంటుంది. ఉదాహరణకు రూ.100 విలువైన దీర్ఘకాలిక బాండ్‌కు రూ.6 రాబడి లభిస్తుంటే.. అదే బాండ్‌ను మార్కెట్లో రూ.90కి కొనుగోలు చేస్తే రూ.6 రాబడి లభిస్తే లాభమే కదా. 

ఆర్థిక వ్యవస్థ కుదుపులకు లోనవుతుందని మదుపరులు భావిస్తే తమ సొమ్మును స్టాక్‌ మార్కెట్ల నుంచి తొలగించి దీర్ఘకాలిక బాండ్స్‌లో మదుపు చేస్తారు. అప్పుడు రాబడి తగ్గుతుంది. ఉదాహరణకు రూ.100 దీర్ఘకాలిక బాండ్‌కు రూ.6 రాబడి లభిస్తే.. మార్కెట్లో డిమాండ్‌ పెరిగి ఆ బాండ్‌ను రూ.120 కొనుగోలు చేసినా రూ.6 రాబడి లభిస్తుంది. ఇప్పుడు అదే పరిస్థితి నెలకొంది. వడ్డీరేట్లు పెరిగినా 2018లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమన భయంతో చాలా మంది దీర్ఘకాలిక బాండ్స్‌ను ఎగబడి కొన్నారు. దీర్ఘకాలిక.. స్వల్పకాలిక బాండ్ల ఈల్డ్‌కర్వ్‌లు ఎప్పుడైతే  సమానమవుతాయో అప్పుడు సంక్షోభ భయాలు పెరిగిపోతాయి. అప్పుడు దీర్ఘకాలిక బాండ్లకు డిమాండ్‌ మరింత పెరిగి ఈల్డ్‌ తగ్గుతుంది. 

తాజా పరిస్థితి ఇదీ..
ఆగస్టు 14న అమెరికా ట్రెజరీ జారీ చేసిన 10ఏళ్ల  నుంచి 2ఏళ్ల వరకు కాలావధి ఉన్న బాండ్ల ఈల్డ్‌ రేటు 2ఏళ్ల కాలావధి బాండ్ల ఈల్డ్‌ రేటు కన్నా తక్కువకు పడిపోయింది. 2007 తర్వాత ఈ బాండ్ల ఈల్డ్‌ ఇంత తక్కువకు పడిపోవడం ఇదే తొలిసారి. కాకపోతే వెంటనే తేరుకొని మళ్లీ  కొంచెం పుంజుకొంది. దీంతో మార్కెట్లు బెంబేలెత్తిపోయాయి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.