Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143374
            [news_title_telugu_html] => 

వరద ఉద్ధృతికి కదులుతున్న ప్రకాశం బ్యారేజీ రెయిలింగ్‌

[news_title_telugu] => వరద ఉద్ధృతికి కదులుతున్న ప్రకాశం బ్యారేజీ రెయిలింగ్‌ [news_title_english] => Barrage railings are shaking due to heavy water flow [news_short_description] => ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. 2009 తరువాత ఇంతగా భారీగా వరద నీరు ప్రకాశం బ్యారేజీకి చేరుకోలేదు. ఒకానొక దశలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కృష్ణమ్మ వరద ఉద్ధృతికి ప్రకాశం బ్యారేజీ తట్టుకోలేదని తీవ్ర ఆందోళన చెందారు. అప్పటిల్లో ఒక్కరోజే 14లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి వచ్చింది. [news_tags_keywords] => PrakasamBarrage,Waterflow,Ap news,Floods [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-17 07:55:48 [news_isactive] => 1 [news_status] => 2 ) )
వరద ఉద్ధృతికి కదులుతున్న ప్రకాశం బ్యారేజీ రెయిలింగ్‌ - Barrage railings are shaking due to heavy water flow - EENADU
close

తాజా వార్తలు

వరద ఉద్ధృతికి కదులుతున్న ప్రకాశం బ్యారేజీ రెయిలింగ్‌

వాహనాలు, సందర్శకుల రాకపోకల నియంత్రణ

విద్యాధరపురం, (విజయవాడ) న్యూస్‌టుడే: ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. 2009 తరువాత ఇంతగా భారీగా వరద నీరు ప్రకాశం బ్యారేజీకి చేరుకోలేదు. ఒకానొక దశలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కృష్ణమ్మ వరద ఉద్ధృతికి ప్రకాశం బ్యారేజీ తట్టుకోలేదని తీవ్ర ఆందోళన చెందారు. అప్పటిల్లో ఒక్కరోజే 14లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి వచ్చింది. ఆ తరువాత బ్యారేజీకి సంబంధించిన రెండు పిల్లర్లు వద్ద కొంత మేర దెబ్బ తినడంతో మరమ్మతులు చేశారు. ఆ తరువాత ఎప్పుడూ అంత నీటిని ప్రకాశం బ్యారేజీ నుంచి విడుదల చేయలేదు. గత పదేళ్లలో కృష్ణానదిలో నీరు కూడా లభించక పట్టిసీమ నుంచి గత ప్రభుత్వం గోదావరి నీటిని యుద్ధప్రాతిపదికన తీసుకురావాల్సిన పరిస్థితులు నవ్యాంధ్ర రాజధానికి ఏర్పడ్డాయి. అయితే దశాబ్ద కాలం తరువాత ఎగువన కురిసిన వర్షాల కారణంగా శుక్రవారం 8.5లక్షల క్యూసెక్కుల నీరు పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి చేరింది. బ్యారేజీపైన ఉన్న రెయిలింగ్‌ కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. 24, 39వ ఖానాల వద్ద వరద ఉద్ధృతి కారణంగా ఫుట్‌పాత్‌కు ఏర్పాటు చేసిన రెయిలింగ్‌ దెబ్బతింది. అది ఏక్షణంలోనైనా పడిపోవచ్చునని పోలీసు అధికారులు చెబుతున్నారు.

రాకపోకల నియంత్రణ: వరద ఉద్ధృతి క్రమేపి పెరుగుతుండటంతో ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పరవళ్లు తిలకించే వారి సంఖ్య పెరిగింది. భద్రతా కారణాల దృష్ట్యా ఆటోలు, కార్లు తొలుత పోలీసు అధికారులు బ్యారేజీ వైపునకు వెళ్లకుండా నియంత్రించారు. తరువాత పరిస్థితి మరింత తీవ్రం కావడంతో వీక్షకులను సైతం అటువైపునకు వెళ్లకుండా పోలీసులు నియంత్రిస్తున్నారు. బ్యారేజీపైన రెయిలింగ్‌ సరిగా లేకపోవడంతో సెల్ఫీలు తీసుకునేవారు ప్రమాదాల బారిన పడతారన్న భావంతో వారిని బ్యారేజీపైకి రాకుండా అడ్డుకుంటున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.