Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143925
            [news_title_telugu_html] => 

తాతే కాటేశాడు..గర్భం దాల్చిన బాలిక 

[news_title_telugu] => తాతే కాటేశాడు..గర్భం దాల్చిన బాలిక  [news_title_english] => [news_short_description] => మనవరాలిని లాలించాల్సిన వయస్సులో కామంతో కళ్లుమూసుకుపోయి తాతే కాటేశాడు. ఫలితంగా బాలిక గర్భం దాల్చింది. సభ్య సమాజం తలదించుకునే ఈ సంఘటన జగిత్యాల [news_tags_keywords] => Jagityala,Crime [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => CdUh6_YtZLY [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-18 09:31:15 [news_isactive] => 1 [news_status] => 2 ) )
తాతే కాటేశాడు..గర్భం దాల్చిన బాలిక  - EENADU
close

తాజా వార్తలు

తాతే కాటేశాడు..గర్భం దాల్చిన బాలిక 

ఫిర్యాదు చేసిన తల్లి

జగిత్యాల, న్యూస్‌టుడే: మనవరాలిని లాలించాల్సిన వయస్సులో కామంతో కళ్లుమూసుకుపోయి తాతే కాటేశాడు. ఫలితంగా బాలిక గర్భం దాల్చింది. సభ్య సమాజం తలదించుకునే ఈ సంఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..  జగిత్యాలకు చెందిన బాలిక (15) జిల్లాలోని ఓ కస్తూర్బా పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. గత నెల రోజులుగా తరచూ అనారోగ్యానికి గురి కావటం.. నెలసరి తప్పడంతో ఉపాధ్యాయులు స్థానిక వైద్యులకు చూపించారు. బాలిక గర్భం దాల్చినట్లు తెలియడంతో తల్లిదండ్రులను పిలిచి అప్పగించారు. బాలికను జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో చూపించటంతో నాలుగు నెలల గర్భిణిగా తేల్చారు. హతాశులైన తల్లిదండ్రులు బాలికను నిలదీయడంతో విశ్రాంత ఉపాధ్యాయుడైన ‘తాతే చేశాడు’ అని చెప్పడంతో నిర్ఘాంతపోయారు. వేసవి సెలవుల్లో ఇంటికి వచ్చిన బాలికను తాత (తండ్రి చిన్నాన) ఆమెను లొంగదీసుకున్నాడని చెప్పడంతో అమాయకులైన తల్లిదండ్రులకు తమ కుమార్తె పరిస్థితి చూసి మతి తప్పినట్లయ్యింది. విషయం బంధువులకు తెలియడంతో పరువు పోతుందని భావించి కారకుడైన తాతను పిలిచారు. ఇదేమని అడిగితే తనకేమి తెలియదని బుకాయించాడు. అనవసరంగా తనపై అబాండం మోపుతున్నారని, తనకు ప్రాణ భయం ఉందని పోలీసులను ఆశ్రయించాడు. ఇంటికి వెళ్లిన పోలీసులు విచారించడంతో బాలిక అసలు విషయం చెప్పింది. అయినప్పటికీ ఫిర్యాదు చేయటానికి వెనకడుగు వేసింది. పరువు పోతుందని ఇరువైపులా మాట్లాడారు. ఫలితం లేకపోవడంతో చివరకు శనివారం రాత్రి 9.30 గంటలకు తర్వాత బాలిక జగిత్యాల పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.