Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144050
            [news_title_telugu_html] => 

ప్రపంచానికి నచ్చింది..కేసీఆర్‌కు నచ్చలేదు:నడ్డా

[news_title_telugu] => ప్రపంచానికి నచ్చింది..కేసీఆర్‌కు నచ్చలేదు:నడ్డా [news_title_english] => JP Nadda Speech in BJP Open Meeting [news_short_description] => దక్షిణ భారతదేశానికి ముఖ ద్వారమైన తెలంగాణకు రావడం సంతోషంగా ఉందని భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌నడ్డా... [news_tags_keywords] => JP Nadda,BJP,Ts Politics [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => KlLwbLL1e84 [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-19 00:22:52 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ప్రపంచానికి నచ్చింది..కేసీఆర్‌కు నచ్చలేదు:నడ్డా - JP Nadda Speech in BJP Open Meeting - EENADU
close

తాజా వార్తలు

ప్రపంచానికి నచ్చింది..కేసీఆర్‌కు నచ్చలేదు:నడ్డా

మిషన్‌ కాకతీయ.. మిషన్‌ ఫర్‌ కమీషన్‌గా మారింది
తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాం

హైదరాబాద్‌: దేశంలోని అన్ని పార్టీల్లోనూ వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయని భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగత్‌ప్రకాశ్‌ నడ్డా అన్నారు. భాజపా మినహా అన్ని పార్టీల్లో దాదాపు ఇదే పద్ధతి ఉందని విమర్శించారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో తెదేపాకు చెందిన నేతలు, కార్యకర్తలు భారీగా భాజపాలో చేరారు. ఈ సందర్భంగా నడ్డా ప్రసంగించారు. దక్షిణ భారతదేశానికి ముఖ ద్వారమైన తెలంగాణకు రావడం సంతోషంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తుందనే నమ్మకం తనకుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంతో సాహసంతో తెలంగాణ ప్రజలు రజాకార్లను తరిమికొట్టారని.. నిరంకుశ నిజాం పాలన నుంచి తెలంగాణ ప్రజలకు వల్లభ్‌బాయ్‌ పటేల్‌ విముక్తి కలిగించారన్నారు. కశ్మీర్‌ విషయంలో ప్రధాని సాహసోపేత నిర్ణయానికి అందరూ కృతజ్ఞతలు చెబుతున్నారన్నారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం, ప్రతిపత్తి తాత్కాలికమే అని ఆనాడు అన్నారని.. అలా అంటూనే 70 ఏళ్లు ఓట్ల కోసం పొడిగించారని నడ్డా దుయ్యబట్టారు. ఏళ్ల తరబడి వేధిస్తున్న కశ్మీర్‌ సమస్యను మోదీ ప్రభుత్వం పరిష్కరించిందని చెప్పారు. ఒకే దేశం-ఒకే రాజ్యాంగం అనే కలను ప్రధాని మోదీ సాకారం చేశారన్నారు. దేశాభివృద్ధికి మోదీ నేతృత్వంలో పనిచేసేందుకు ముందుకొచ్చిన వారందరికీ నడ్డా కృతజ్ఞతలు తెలిపారు. 

అడగ్గానే ఎయిమ్స్‌ మంజూరు చేశాం

‘‘దేశంలోని అన్ని పార్టీల్లో వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ‘నేను.. నా తర్వాత నా కుమారుడు’.. భాజపా మినహా అన్ని పార్టీల్లోనూ ఇదే పద్ధతి. తండ్రుల అధికారాన్ని అడ్డుపెట్టుకుని కుమారులు రూ.కోట్లు దండుకుంటున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఆయుష్మాన్‌ భారత్‌ లాంటి భారీ పథకం అమలు చేస్తున్నారు. భారత్‌ త్వరలోనే 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ గల దేశంగా అవతరిస్తుంది. జల్‌ జీవన్‌ మిషన్‌ కింద ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచినీరు అందిస్తాం. ప్రధాని ఆవాస్‌ యోజనతో ప్రతి పేదవాడికి పక్కా ఇళ్లు నిర్మిస్తాం. ప్రతి స్వయం సహాయక బృందానికి రూ.5లక్షల వరకు ఓవర్‌ డ్రాఫ్ట్‌ సదుపాయం కల్పిస్తాం. అడగ్గానే తెలంగాణకు ఎయిమ్స్‌ మంజూరు చేశాం’’ అని నడ్డా వివరించారు.

పవిత్రమైన పేర్లు పెట్టి రూ.కోట్లు దోచుకుంటున్నారు

‘‘ప్రపంచానికి నచ్చిన ఆయుష్మాన్‌ భారత్.. తెలంగాణ సీఎంకు నచ్చకపోవడం బాధాకరం. సీఎం కేసీఆర్‌ వాస్తు పేరుతో సచివాలయాన్ని కూలగొడుతున్నారు. హరితహారం నిధులకు లెక్కలు చూపరు.. ఆడిటింగ్‌ కూడా లేదు. ఈ పథకంలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయి. తెలంగాణ మంత్రివర్గంలో మహిళలు, ఎస్సీలకు చోటు లేకపోవడం బాధాకరం. రూ.30వేల కోట్లతో నిర్మించాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.లక్ష కోట్లకు పెంచారు. ప్రాజెక్టుకు పవిత్రమైన పేరు పెట్టి కోట్లు దోచుకుంటున్నారు. మిషన్‌ కాకతీయ పథకం.. మిషన్‌ ఫర్‌ కమీషన్‌గా మారింది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద ఇచ్చిన నిధులను వినియోగించుకోలేకపోయారు. రెండు పడక గదుల ఇళ్లు ఇప్పటి వరకు ఎన్ని ఇచ్చారు?’’ అని నడ్డా ప్రశ్నించారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.