Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144424
            [news_title_telugu_html] => 

గర్భిణిని తన్నిన మహిళా ఎస్పీ!

[news_title_telugu] => గర్భిణిని తన్నిన మహిళా ఎస్పీ! [news_title_english] => Woman SP kicked pregnant! [news_short_description] => ఆమె పండంటి బిడ్డను ఎత్తుకోవాలనుకుంది. పాపాయి మురిపాలతో మురిసిపోవాలని తలంచింది. కానీ మాతృత్వ మాధుర్యాన్ని పొందుదామనుకున్న ఆమె కలను ఓ మహిళా ఎస్పీ [news_tags_keywords] => Crime,Odisha,Police SP [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-19 07:09:05 [news_isactive] => 1 [news_status] => 2 ) )
గర్భిణిని తన్నిన మహిళా ఎస్పీ! - Woman SP kicked pregnant! - EENADU
close

తాజా వార్తలు

గర్భిణిని తన్నిన మహిళా ఎస్పీ!

భువనేశ్వర్‌:  ఆమె పండంటి బిడ్డను ఎత్తుకోవాలనుకుంది. పాపాయి మురిపాలతో మురిసిపోవాలని తలంచింది. కానీ మాతృత్వ మాధుర్యాన్ని పొందుదామనుకున్న ఆమె కలను ఓ మహిళా ఎస్పీ చిదిమివేసింది. గర్భిణి అనికూడా చూడకుండా పొత్తికడుపు మీద] బూటుకాలితో తన్నింది. ఆ పోలీసు ఉన్నతాధికారిపై చర్యతీసుకోవాలని బాధితురాలు ఒడిశా న్యాయస్థానాన్ని వేడుకుంది. కేసును పరిశీలించిన జడ్జి ఆ అధికారిమీద క్రిమినల్‌ కేసునమోదు చేయాలని ఆదేశించారు. జులై 3న సుందర్‌గఢ్‌ జిల్లాలోని కణిక గ్రామంలో కారుఢీకొని ఒక యువకుడు మృతిచెందడంతో బాధ్యుణ్ణి అరెస్టుచేసి న్యాయం చేయాలంటూ గ్రామస్తులు పోలీసు స్టేషన్‌ వద్ద విధ్వంసానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకరుగా అభియోగాన్ని ఎదుర్కొంటున్న వారిలో బాధితురాలు ప్రియాడే భర్త ఉత్తమ్‌ డే కూడా ఒకరు. కేసు దర్యాప్తును ఎస్పీ సౌమ్య మిశ్రా స్వయంగా పర్యవేక్షించారు. ఉత్తమ్‌ డే ఆచూకీ చెప్పాలంటూ ఆమె తనను కొట్టారని, పొట్టమీద బూటు కాళ్లతో తన్నారని, అందువల్ల తనకు గర్భవిచ్ఛితి జరిగిందని ఎస్పీని శిక్షించి తనకున్యాయం చేయాలని, ప్రియా డే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయమూర్తి ఆదేశాలతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.