close

తాజా వార్తలు

Published : 01/01/1970 05:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వెల్లింగ్టన్‌: అమీ శాటర్త్‌వైట్‌. న్యూజిలాండ్‌ మహిళల క్రికెట్‌ జట్టు సారథి. లీ తహూహూ అదే జట్టులో సీనియర్‌ బౌలర్‌. మనసులు కలిశాయి. కట్టుబాట్లను విడనాడారు. అందర్నీ ఎదిరించారు. ప్రపంచంలోనే పెళ్లి చేసుకున్న తొలి మహిళల క్రికెట్‌ జంటగా చరిత్ర సృష్టించారు. తాజాగా ఈ దంపతులు ఓ తీపి కబురు చెప్పారు. ఏంటో తెలుసా? లీ తహూహూ ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది.

‘లీ, నేను ఈ విషయం చెప్పేందుకు ఎంతో సంతోషిస్తున్నాం. కొత్త ఏడాదిలో మా జీవితాల్లోకి తొలి చిన్నారి రాబోతోంది. మా జీవితాల్లో ఇదొక ప్రత్యేక సమయం. ఈ కొత్త అధ్యాయం కోసం మేం ఎదురు చూడలేకపోతున్నాం’ అని అమీ ఇన్‌స్టాలో వెల్లడించింది. ‘బేబీ శాటర్ హుహు’ 2020 జనవరిలో రాబోతోందని ఓ చిత్రాన్ని ఉంచింది. ఈ సందర్భంగా శాటర్‌వైట్‌కు సైతం న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు వేతనంతో కూడిన మాతృత్వపు సెలవును మంజూరు చేయడం విశేషం. అయితే ఏ పద్ధతుల ద్వారా వీరు బిడ్డకు జన్మనిస్తున్నారో వెల్లడించలేదు. 

సెలవు తీసుకున్నప్పటికీ జట్టుకు మార్గనిర్దేశకురాలిగా కొనసాగుతానని అమీ వెల్లడించింది. 2021 ప్రపంచకప్‌ నాటికి తిరిగి జట్టులో చేరుతానని పేర్కొంది. కివీస్‌ బోర్డు కొత్త విధానం ప్రకారం 2019-20 కాలానికి ఆమెకు కాంట్రాక్టుకు ఇస్తున్నారు. పూర్తిస్థాయిలో వేతనం చెల్లించనున్నారు. ‘ఒక కుటుంబంగా మారే క్రమంలో ఆట నుంచి విరామం తీసుకోవాడానికి న్యూజిలాండ్‌ క్రికెట్‌ ఎంతో మద్దతు ఇస్తున్నందుకు నేనెంతో అదృష్టవంతురాలిని. ఒక మార్గనిర్దేశకురాలిగా జట్టుకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు నేనెప్పుడూ సిద్ధంగానే ఉంటాను’ అని అమీ తెలిపింది. 32 ఏళ్ల ఆమె గతేడాది సారథ్యం అందుకుంది. ఇప్పటి వరకు 119 వన్డేలు, 99 టీ20లు ఆడింది. వన్డేల్లో వెంటవెంటనే నాలుగు శతకాలు చేసిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. 28 ఏళ్ల తహూహూ 116 మ్యాచుల్లో 114 వికెట్లు పడగొట్టింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.