Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145112
            [news_title_telugu_html] => 

అభినందన్‌ను పట్టుకున్న పాక్‌ కమాండో హతం

[news_title_telugu] => అభినందన్‌ను పట్టుకున్న పాక్‌ కమాండో హతం [news_title_english] => Pakistani commando behind capture of Abhinandan killed [news_short_description] => భారత వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను పట్టుకున్న పాక్‌ కమాండో అహ్మద్‌ ఖాన్‌ హతమయ్యాడు. నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యం ..... [news_tags_keywords] => Amamad khan,Abhinandan,Nakyal sector [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-21 00:20:49 [news_isactive] => 1 [news_status] => 2 ) )
అభినందన్‌ను పట్టుకున్న పాక్‌ కమాండో హతం - Pakistani commando behind capture of Abhinandan killed - EENADU
close

తాజా వార్తలు

అభినందన్‌ను పట్టుకున్న పాక్‌ కమాండో హతం


దిల్లీ: భారత వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను పట్టుకున్న పాక్‌ కమాండో అహ్మద్‌ ఖాన్‌ హతమయ్యాడు. నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యం జరిపిన కాల్పుల్లో అతడు మృతిచెందాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అభినందన్‌ నడిపిన ఐఏఎఫ్‌ జెట్‌ పాక్‌ సరిహద్దు వద్ద కూలడంతో ఆయన పాక్‌ సైన్యానికి పట్టుబడటం.. ఆయనను శత్రు సైన్యం చిత్రహింసలకు గురిచేయడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అహ్మద్‌ ఖాన్‌ పాక్‌ సైన్యం ప్రత్యేక సేవా గ్రూప్‌లో సుబేదార్‌గా పనిచేస్తున్నాడు. చొరబాటుదారులను భారత్‌లోకి పంపేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో నాక్యాల్‌ సెక్టార్‌లో ఈ నెల 17న భారత సైన్యం జరిపిన కాల్పుల్లో అతడు హతమయ్యాడు. 

అభినందన్‌ పట్టుబడిన సందర్భంలో విడుదలైన ఫొటోల్లో అహ్మద్ ఖాన్‌ ఆయన వెనుకే ఉన్నాడు. బాలాకోట్‌ వద్ద జరిపిన దాడుల అనంతరం పాక్‌ జెట్‌లను తరుముకుంటూ వెళ్లిన మిగ్‌ 21ను పాక్‌ సైన్యం కూల్చివేసింది. ఆ సమయంలో అభినందన్‌ పట్టుబడ్డారు. భారత్‌ - పాక్‌ సరిహద్దులో పాక్‌ నుంచి ఉగ్రవాదులను భారత్‌కు అక్రమంగా తరలించేందుకు అహ్మద్‌ ఖాన్‌ కీలకంగా వ్యవహరించేవాడని తెలుస్తోంది. దీంతో పాటు జైషే మహ్మద్‌కు చెందిన సుశిక్షితులైన ఉగ్రవాదులను ఉపయోగించి  కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని సజీవంగా ఉంచేందుకు పాక్‌ రచించే వ్యూహాలను అతడు అమలు చేసేవాడని సమాచారం.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.