Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145133
            [news_title_telugu_html] => 

రాజధాని మార్చాలనే ఆ కుట్రలు:చంద్రబాబు

[news_title_telugu] => రాజధాని మార్చాలనే ఆ కుట్రలు:చంద్రబాబు [news_title_english] => Chandrababu naidu Speech in avanigadda [news_short_description] => ఏపీ రాజధాని అమరావతిని ముంపు ప్రాంతంగా చిత్రీకరించి కావాలనే రాజధాని నిర్మాణాన్ని నిలిపివేశారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో వరద ముంపు బాధితులను మంగళవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... [news_tags_keywords] => Chandrababu,Amaravati,Flood,Ap Politics [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-21 00:11:18 [news_isactive] => 1 [news_status] => 2 ) )
రాజధాని మార్చాలనే ఆ కుట్రలు:చంద్రబాబు - Chandrababu naidu Speech in avanigadda - EENADU
close

తాజా వార్తలు

రాజధాని మార్చాలనే ఆ కుట్రలు:చంద్రబాబు

అవనిగడ్డ: ఏపీ రాజధాని అమరావతిని ముంపు ప్రాంతంగా చిత్రీకరించి కావాలనే రాజధాని నిర్మాణాన్ని నిలిపివేశారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో వరద ముంపు బాధితులను మంగళవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు 33వేల ఎకరాలు ఇచ్చారని.. వీటిలో మౌలిక వసతులకోసం భూమిని కేటాయించిన తర్వాత ఇంకా 8 వేల ఎకరాల వరకు మిగులుతుందని చెప్పారు. ఆ భూమి అమ్మినా ఖర్చు లేకుండా రాజధానిని నిర్మించుకోవచ్చని చంద్రబాబు అన్నారు.

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణాలు నిలిచిపోయాయని ఆయన విమర్శించారు. రాజధానిని మార్చాలనే కుట్రతోనే ముంపుప్రాంతం అంటూ చర్చ లేవనెత్తుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. అమరావతిపై మంత్రి బొత్స దారుణంగా మాట్లాడుతున్నారన్నారు. ఇలాంటి కుట్రలు, కుతంత్రాలను ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. వైకాపా కుయుక్తులపై ఎంతవరకైనా వెళ్తామన్నారు. పట్టిసీమతో అవనిగడ్డ ప్రాంతంలో వాణిజ్య పంటలకు నీరిచ్చిన ఘనత తెదేపాకే దక్కుతుందన్నారు. ప్రజలకు న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.