Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145658
            [news_title_telugu_html] => 

కశ్మీర్‌ అంశంలోకి ప్రియాంక చోప్రాను లాగిన పాక్‌

[news_title_telugu] => కశ్మీర్‌ అంశంలోకి ప్రియాంక చోప్రాను లాగిన పాక్‌ [news_title_english] => Remove Priyanka Chopra as Goodwill Ambassador [news_short_description] => ఆర్టికల్ 370 రద్దుతో భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు ఇప్పట్లో ముగింపు లభించేలా కనిపించడం లేదు. [news_tags_keywords] => Goodwill Ambassador,Priyanka Chopra ,Pakistan , UNICEF [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-22 00:38:29 [news_isactive] => 1 [news_status] => 2 ) )
కశ్మీర్‌ అంశంలోకి ప్రియాంక చోప్రాను లాగిన పాక్‌ - Remove Priyanka Chopra as Goodwill Ambassador - EENADU
close

తాజా వార్తలు

కశ్మీర్‌ అంశంలోకి ప్రియాంక చోప్రాను లాగిన పాక్‌

యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉండటమే కారణం

న్యూయార్క్‌: ఆర్టికల్ 370 రద్దుతో భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు ఇప్పట్లో ముగింపు లభించేలా కనిపించడం లేదు. దాయాది దేశానికి అంతర్జాతీయ స్థాయిలో ఆశించిన మద్దతు లభించకపోయినా, భారత్‌ను ఎండగట్టడానికి ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. తాజాగా గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రాను ఈ అంశంలోకి లాగింది. దానికి కారణం ఆమె యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉంటూ తన మాతృదేశానికి మద్దతు ఇవ్వడమే. ఆమెను అంబాసిడర్ హోదా నుంచి తొలగించాలని కోరుతూ పాక్‌ మానవ హక్కుల మంత్రి షిరీన్‌ మజారీ యునిసెఫ్‌కు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. అలాగే ఆ లేఖను బుధవారం ట్విటర్‌లో షేర్ చేశారు. పాకిస్థాన్‌కు సంబంధించి భారత ప్రభుత్వ నిర్ణయాలు, పొంచి ఉన్న అణుముప్పుకు మద్దతు తెలుపుతున్నారని ఆ లేఖలో ప్రియాంక మీద విమర్శలు చేస్తూ, భారత్‌ మీద అక్కసు వెళ్లగక్కారు.  

పుల్వామా ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాల మీద భారత్ నిర్వహించిన వైమానిక దాడులకు మద్దతుగా యునిసెఫ్ శాంతి దూతగా ఉన్న ప్రియాంక అప్పట్లో ట్వీట్ చేశారు. దీనిపై లాస్‌ఏంజెల్స్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రియాంక మీద ఓ పాకిస్థానీ బాలిక అక్కసును ప్రదర్శించింది. దానికి ప్రియాంక తన మీద కేకలు వేసి పరువు తీసుకోవద్దని ఘాటుగా సమాధానం ఇవ్వడంతో పాటు,  అందరిలా మధ్యేమార్గంగా వెళ్లాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. 2016లో ఈ భారత స్టార్‌ హీరోయిన్‌ యునిసెఫ్ గుడ్‌ విల్ అంబాసిడర్‌గా నియమితురాలైంది. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.