Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145667
            [news_title_telugu_html] => 

హైదరాబాద్‌లో అమెజాన్‌ క్యాంపస్‌ ప్రారంభం

[news_title_telugu] => హైదరాబాద్‌లో అమెజాన్‌ క్యాంపస్‌ ప్రారంభం [news_title_english] => Amazon Campus Started at Hyderabad [news_short_description] => ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రపంచంలోనే తన అతిపెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ఇవాళ ప్రారంభించింది. తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ ఈ భవనాన్ని ప్రారంభించారు. [news_tags_keywords] => Amazon,e commerce,Ts News [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-21 19:14:44 [news_isactive] => 1 [news_status] => 2 ) )
హైదరాబాద్‌లో అమెజాన్‌ క్యాంపస్‌ ప్రారంభం - Amazon Campus Started at Hyderabad - EENADU
close

తాజా వార్తలు

హైదరాబాద్‌లో అమెజాన్‌ క్యాంపస్‌ ప్రారంభం

హైదరాబాద్‌: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రపంచంలోనే తన అతిపెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ఇవాళ ప్రారంభించింది. తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ ఈ భవనాన్ని ప్రారంభించారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ నానక్‌రామ్‌గూడలో రూ.400 కోట్ల పెట్టుబడితో అమెజాన్‌ దీన్ని ఏర్పాటు చేసింది. 15 వేలమంది పనిచేయగల సామర్థ్యంతో 9.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్యాంపస్‌ను నిర్మించింది. అమెరికాకు వెలుపల అమెజాన్ సొంత క్యాంపస్ అయిన ఈ భవనాన్ని కేవలం మూడేళ్లలో పూర్తి చేశారు. 

2016 మార్చి 31న అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా దీనికి శంకుస్థాపన జరిగింది. సుమారు 30 లక్షల చదరపు అడుగుల్లో దీని నిర్మాణం చేపట్టారు. ఇందులో పది లక్షల చదరపు అడుగులను పార్కింగుకు కేటాయించారు. పూర్తిగా అధునాతన నమూనాలో సకల వసతులతో దీనిని నిర్మించారు. అమెజాన్‌కు ప్రస్తుతం ఏడు వేల మంది ఉద్యోగులున్నారు. వచ్చే నెలాఖరు నాటికి ఈ సంఖ్య పదివేలకు చేరనుంది. అమెజాన్‌ దశాబ్దం క్రితం హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించింది. ఇప్పటికే శంషాబాద్‌ విమానాశ్రయం వద్ద నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. తెలంగాణలో అనుకూలతలను పరిగణనలోకి తీసుకొని ఇక్కడ రూ.400 కోట్ల పెట్టుబడితో ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాంగణం నిర్మించాలని నిర్ణయించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం పది ఎకరాల భూమిని కేటాయించింది. ఈ ప్రాంగణం నుంచి అమెజాన్‌ ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలను నిర్వహించనుంది. వ్యాపార నిర్వహణ ప్రణాళికలకు తోడు కొత్త సాఫ్ట్‌వేర్‌ రూపకల్పన, వాణిజ్య విస్తరణ కార్యాచరణకు ఇది కేంద్రం కానుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.