Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145680
            [news_title_telugu_html] => 

పబ్‌జీ పూర్తి పేరు తెలుసా?

[news_title_telugu] => పబ్‌జీ పూర్తి పేరు తెలుసా? [news_title_english] => Amitabh Bachchan asks full form of PUBG on KBC [news_short_description] => నేటి తరం యువతలో పబ్‌జీ గేమ్‌ గురించి తెలియని వారు.. వినని వారూ ఉండరంటే అతిశయోక్తి కాదు! అంతగా పాపులర్‌ అయ్యింది ఈ గేమ్‌. దీన్ని ఆడేందుకు యువత..... [news_tags_keywords] => Amitabh Bachchan,PUBG,full form [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-22 00:30:29 [news_isactive] => 1 [news_status] => 2 ) )
పబ్‌జీ పూర్తి పేరు తెలుసా? - Amitabh Bachchan asks full form of PUBG on KBC - EENADU
close

తాజా వార్తలు

పబ్‌జీ పూర్తి పేరు తెలుసా?

ఇంటర్నెట్‌డెస్క్‌: నేటి తరం యువతలో పబ్‌జీ గేమ్‌ గురించి తెలియని వారు.. వినని వారూ ఉండరంటే అతిశయోక్తి కాదు! అంతగా పాపులర్‌ అయ్యింది ఈ గేమ్‌. దీన్ని ఆడేందుకు యువత ఎంతగా ఆసక్తి చూపుతారో అందరికీ తెలిసిందే. ఇంతకీ మీరూ పబ్‌జీ ఆడుతున్నారా? అయితే పబ్‌జీ పూర్తిపేరేంటో తెలుసా?బహుశా చాలా మంది ‘తెలీదు’ అనే సమాధానం చెప్పొచ్చు. అయినా ఇదంతా ఇప్పుడెందుకు అనుకుంటున్నారా? ప్రముఖ నటుడు, బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించే కౌన్‌బనేగా కరోడ్‌పతి-11 రెండో ఎపిసోడ్‌లో ఈ ప్రశ్నే అడిగారు. అప్పటి నుంచి ఇది సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివేక్‌ భగత్‌ అనే వ్యక్తి.. అప్పటి వరకు అడిగిన ప్రశ్నలకు చకచకా సమాధానం చెబుతూ వచ్చాడు. ‘పబ్‌ జీ పూర్తి పేరు తెలుసా’ అనే ప్రశ్న అడిగే సరికి బిక్కమొహం వేయడం అతడి వంతైంది. చివరికి ఆడియన్స్‌ లైఫ్‌లైన్‌ తీసుకోవాల్సి వచ్చింది. ‘ప్లేయర్‌ అన్‌నోన్స్‌ బ్యాటిల్‌ గ్రౌండ్స్‌’ అనే సమాధానానికి ఎక్కువ మంది ఓటేయడంతో సరైన సమాధానం చెప్పగలిగారు. ఈ ప్రశ్న అడిగిన తర్వాత చాలా మంది సైతం ఇంతకీ పూర్తి పేరేమి అయ్యుంటుదబ్బా అని నెట్టింట తెగ వెతికారట. దీనిపై సోషల్‌మీడియాలో కూడా చర్చ జరిగింది. నేటి తరానికి ఎంతో దగ్గరైన ఈ గేమ్‌ గురించి ప్రశ్న అడిగితే చెప్పలేకపోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం!!


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.