Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146172
            [news_title_telugu_html] => 

అలా గోడలు దూకడమేంటి?

[news_title_telugu] => అలా గోడలు దూకడమేంటి? [news_title_english] => Mamata criticised the way in which the investigative agencies handled the arrest former finance minister [news_short_description] => ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరాన్ని అరెస్టు చేయడం కోసం దర్యాప్తు సంస్థలు వ్యవహరించిన తీరును పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఖండించారు. [news_tags_keywords] => Mamata Banerjee, P Chidambaram ,cbi [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-23 00:39:06 [news_isactive] => 1 [news_status] => 2 ) )
అలా గోడలు దూకడమేంటి? - Mamata criticised the way in which the investigative agencies handled the arrest former finance minister - EENADU
close

తాజా వార్తలు

అలా గోడలు దూకడమేంటి?

చిదంబరం అరెస్టు తీరును ఖండించిన విపక్షాలు

దిల్లీ: ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరాన్ని అరెస్టు చేయడం కోసం దర్యాప్తు సంస్థలు వ్యవహరించిన తీరును పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఖండించారు. దిల్లీలో చిదంబరం నివాసం వద్ద సీబీఐ అధికారులు బుధవారం సాయంత్రం ఆయన్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన ఇంట్లోకి ప్రవేశించడానికి కొందరు అధికారులు గోడలు కూడా దూకారు. 
‘చిదంబరం అరెస్టు విషయంలో అధికారులు వ్యవహరించిన తీరు చాలా నిరుత్సాహపరిచింది. అది చాలా చెడ్డగా, బాధగా అనిపించింది’ అని మమత గురువారం కోల్‌కతాలో విలేకరులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ‘కొన్నిసార్లు అనుసరించే విధానాలు తప్పుగా ఉంటాయి. నేను ఆ కేసు గురించి మాట్లాడటం లేదు. చిదంబరం ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు. ఈ దేశానికి హోం, ఆర్థిక మంత్రిగా సేవలు అందించారు’ అని ఆమె పేర్కొన్నారు. 

చిదంబరం అరెస్టుపై చెన్నైలో డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘సీబీఐ అధికారులు గోడలు దూకి, చిదంబరాన్ని అరెస్టు చేయడాన్ని నేను చూశాను. ఆ వ్యవహారం సిగ్గుచేటు. ఆయన ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. కానీ ఇప్పుడు ఆయన్ను అరెస్టు చేశారు. ఇది ఖండించదగింది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
   


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.