Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146190
            [news_title_telugu_html] => 

ఆమె వాంగ్మూలంతోనే చిదంబరం అరెస్టు!

[news_title_telugu] => ఆమె వాంగ్మూలంతోనే చిదంబరం అరెస్టు! [news_title_english] => Indrani Mukherjea statement is a key evidence to CBI [news_short_description] => కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం అరెస్టు వ్యవహారం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పెద్ద హైడ్రామా ..... [news_tags_keywords] => Chidambaram,INX media case,Indrani Mukherjea,CBI [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-22 16:27:04 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఆమె వాంగ్మూలంతోనే చిదంబరం అరెస్టు! - Indrani Mukherjea statement is a key evidence to CBI - EENADU
close

తాజా వార్తలు

ఆమె వాంగ్మూలంతోనే చిదంబరం అరెస్టు!

దిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం అరెస్టు వ్యవహారం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పెద్ద హైడ్రామా అనంతరం ఆయన ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారుల బృందం ఉద్రిక్త పరిస్థితుల మధ్య అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పలు దఫాలుగా ఆయనను విచారించిన తర్వాత కొద్దిసేపటి క్రితమే సీబీఐ కోర్టులో అధికారులు చిదంబరాన్ని హాజరు పరిచారు. అయితే, చిదంబరాన్ని అరెస్టు చేసేందుకు ఐఎన్‌ఎక్స్‌ మీడియా సంస్థ యజమాని ఇంద్రాణీ ముఖర్జియా గతేడాది ఫిబ్రవరి 17న ఇచ్చిన వాంగ్మూలమే ప్రధాన ఆధారమైనట్టు సమాచారం. 2006లో చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో దిల్లీలోని నార్త్‌బ్లాక్‌ కార్యాలయంలో కలిసినప్పుడు ఆయన తన కుమారుడు కార్తీని తమకు పరిచయం చేశాడని వాంగ్మూలంలో పేర్కొన్నారు. కార్తీ వ్యాపారాలకు ఐఎన్‌ఎక్స్‌ మీడియా ద్వారా సాయం చేయాలని తనను, తన భర్త పీటర్‌ ముఖర్జియాను కోరారని ఆమె పేర్కొన్నారు. ఆమె ఇచ్చిన ఈ వాంగ్మూలమే చిదంబరంపై సీబీఐ, ఈడీల విచారణకు కీలక ఆధారమైంది. అలాగే, దిల్లీలోని ప్రముఖ హోటల్‌లో కార్తీ తమను క్విడ్‌ ప్రోకో కింద 1మిలియన్‌ డాలర్ల లంచం డిమాండ్‌ చేశాడని ఆమె తన వాంగ్మూలంలో తెలిపారు. 

మరోవైపు, కార్తీ చిదంబరానికి చెందిన అడ్వంటేజ్‌ స్ట్రాటజిక్‌ కన్సల్టింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఏఎస్‌సీపీఎల్‌) కంపెనీతో కలిసి పనిచేసిన సందర్భంలోనే  రూ.305 కోట్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌బీఐ) అందుకోవడానికి ‘ఐఎన్‌ఎక్స్‌ మీడియా’కు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపీబీ) పచ్చజెండా ఊపింది. ఈ వ్యవహారంలో నగదు అందుకున్న కంపెనీలన్నీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చిదంబరం కుమారుడు కార్తి నియంత్రణలో ఉన్నాయన్నది సీబీఐ, ఈడీల ఆరోపణ. ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ మాత్రమే ఈ ఆమోదం తెలపాల్సి ఉన్నప్పటికీ నిబంధనలు ఉల్లంఘించి ఎఫ్‌ఐపీబీ ద్వారా సమ్మతి వచ్చేలా చిదంబరం చక్రం తిప్పారనేది ప్రధాన అభియోగం. ఈ కేసులోనే చిదంబరాన్ని అనేకసార్లు దర్యాప్తు అధికారులు ప్రశ్నించారు. రూ.3500 కోట్ల ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ ఒప్పందం కేసులోనూ ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే, ఐఎన్‌ఎక్స్‌ కేసు వ్యవహారంలోనే కార్తీ చిదంబరం కూడా గతేడాది ఫిబ్రవరిలో అరెస్టైన విషయం తెలిసిందే. తాజాగా ఇదే కేసులో ఇంద్రాణీ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా చిదంబరాన్ని సీబీఐ అరెస్టు చేసింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.