Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146237
            [news_title_telugu_html] => 

రాజధానిపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు

[news_title_telugu] => రాజధానిపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు [news_title_english] => Minister Kodali Nani Comments on Amaravati [news_short_description] => పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ వ్యవహారంపై హైకోర్టు స్టే తాత్కాలికమేనని మంత్రి కొడాలి నాని అన్నారు. ఈ వ్యవహారాన్ని న్యాయపరంగానే ఎదుర్కొంటామని స్పష్టం... [news_tags_keywords] => Kodali Nani,AP Politics,Amaravati [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-23 00:38:51 [news_isactive] => 1 [news_status] => 2 ) )
రాజధానిపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు - Minister Kodali Nani Comments on Amaravati - EENADU
close

తాజా వార్తలు

రాజధానిపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు

అమరావతి: పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ వ్యవహారంపై హైకోర్టు స్టే తాత్కాలికమేనని మంత్రి కొడాలి నాని అన్నారు. ఈ వ్యవహారాన్ని న్యాయపరంగానే ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. అవినీతి అక్రమాలు నివారించి ప్రభుత్వ ధనాన్ని కాపాడటమే లక్ష్యంగా సీఎం జగన్ రివర్స్‌ టెండరింగ్‌  విధానాన్ని తీసుకువచ్చారని.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. రివర్స్ టెండరింగ్‌పై ప్రభుత్వ విధానాలను హైకోర్టు ఎక్కడా తప్పు పట్టలేదన్నారు. ఈ అంశంలో సీఎం జగన్ అడుగులు ముందుకే కానీ వెనక్కి ఉండవన్నారు.

రాజధాని అమరావతిపై మంత్రి బొత్స వ్యాఖ్యల్లో తప్పులేదని నాని వ్యాఖ్యానించారు. పార్టీలో జరుగుతున్న చర్చనే బొత్స వెల్లడించారన్నారు. రాజధానిలో జరిగిన అవినీతి, అక్రమాలపై చర్చ జరగాలన్నదే తన అభిప్రాయమని చెప్పారు. రాజధానిని తరలిస్తామని వైకాపా ఎక్కడా చెప్పలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాజధాని పేరిట రియల్ఎస్టేట్ వ్యాపారం చేసి రూ.కోట్లు దోచుకున్నారని.. తాము చేసిన అక్రమాలు బయట పడతాయనే తెదేపా నేతలు గోల చేస్తున్నారని నాని ఆరోపించారు. రాజధానిని మార్చే ఆలోచన ప్రభుత్వానికి లేదన్న ఆయన.. ఒకవేళ ప్రభుత్వం మార్చాలనుకుంటే తెదేపా నేతలు ఉద్యమాలు ఆపగలవా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై మంత్రివర్గ ఉపసంఘం విచారిస్తోందని, నివేదిక అందాక అక్రమార్కులపై చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రభుత్వ ఖజానాను దోచుకున్న దొంగలెవరైనా జైలుకు వెళ్లక తప్పదని నాని వ్యాఖ్యానించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.