Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146629
            [news_title_telugu_html] => 

నా పారితోషికాన్ని ఇప్పించండి: ‘బిగ్‌బాస్‌’ హౌస్‌మేట్‌

[news_title_telugu] => నా పారితోషికాన్ని ఇప్పించండి: ‘బిగ్‌బాస్‌’ హౌస్‌మేట్‌ [news_title_english] => Madhumitha requests Kamal Haasan for Bigg Boss Tamil remuneration [news_short_description] => విజయ్‌ టీవీ నిర్వాహకులు తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని ‘బిగ్‌బాస్‌’ హౌస్‌మేట్‌, హాస్యనటి మధుమిత ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యాయత్నం [news_tags_keywords] => BiggBoss Tamil, kollywood, Bigboss [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-23 06:59:20 [news_isactive] => 1 [news_status] => 2 ) )
నా పారితోషికాన్ని ఇప్పించండి: ‘బిగ్‌బాస్‌’ హౌస్‌మేట్‌ - Madhumitha requests Kamal Haasan for Bigg Boss Tamil remuneration - EENADU
close

తాజా వార్తలు

నా పారితోషికాన్ని ఇప్పించండి: ‘బిగ్‌బాస్‌’ హౌస్‌మేట్‌

చెన్నై: విజయ్‌ టీవీ నిర్వాహకులు తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని ‘బిగ్‌బాస్‌’ హౌస్‌మేట్‌, హాస్యనటి మధుమిత ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యాయత్నం కారణంగా మధుమితను బిగ్‌బాస్‌ ఇంటి నుంచి పంపించేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తనకు ఇవ్వాల్సిన పారితోషికం వెంటనే ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ తమను బెదిరిస్తోందని విజయ్‌ టీవీ నిర్వాహకులు చెన్నైలోని గిండి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై నటి మధుమిత స్పందించారు.

ఆమె మాట్లాడుతూ.. ‘‘ దాదాపు పదేళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉన్నాను. ఇదివరకు నేను ఎవరిపైనా ఫిర్యాదు చేయలేదు. నాపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. నాకు ఇవ్వాల్సిన పారితోషికాన్నే విజయ్‌ టీవీ నిర్వాహకులను అడిగాను. వాళ్లు బిల్లు పంపమని అడిగారు. నేను కూడా పంపించా. డబ్బులు త్వరలోనే ఇస్తామని చెప్పారు. అంతేతప్ప మా మధ్య ఎలాంటి సమస్య లేదు. కానీ ఉన్నట్టుండి విజయ్‌ టీవీ నిర్వాహకులు నాపై పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేశారో అర్థం కాలేదు. వెంటనే నేను వాళ్లకు ఫోన్‌ చేశా. కానీ స్పందించలేదు. ఈ విషయంలో నటుడు కమల్‌హాసన్‌ జోక్యం చేసుకోవాలి. సరైన పరిష్కారం చూపాలి. నేను బయటకు రావడానికి సంబంధించిన ఫుటేజీలను ప్రసారం చేయకపోవడం బాధాకరంగా ఉంది. నేను వాళ్లతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇతర విషయాలను మాట్లాడలేకపోతున్నానని’’ పేర్కొన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.