close

తాజా వార్తలు

మహేష్‌ కోసం... ‘ప్రత్యేక’ కసరత్తులు

హేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్‌ రావిపూడి దర్శకుడు. సంక్రాంతి కోసం ఈ చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమా నిండా ప్రత్యేకతలే. తొలిసారి మహేష్‌ మిలటరీ నేపథ్యంలో సాగే కథని ఎంచుకున్నారు. ‘ఒక్కడు’ తరవాత మళ్లీ ఈ చిత్రంలో కొండారెడ్డి బురుజు ముందు మహేష్‌ ఫైటింగులు చేశాడు. ఇందుకోసం రామోజీ ఫిలింసిటీలో కొండారెడ్డి బురుజు సెట్‌ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. చాలా కాలం తరవాత విజయశాంతి ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. తమన్నాతో ఓ ప్రత్యేక గీతాన్ని రూపొందిస్తున్నారు. ఈ ప్రత్యేక గీతం  నిజంగానే.. సమ్‌థింగ్‌ స్పెషల్‌గా ఉండాలని చిత్రబృందం భావిస్తోంది. అందుకు కసరత్తులు కూడా మొదలైపోయాయి. ప్రత్యేక గీతాల్ని రూపొందించడంలో తన ప్రత్యేకతని చాటుకునే దేవిశ్రీ ప్రసాద్‌ ఇప్పటికే ఓ మంచి మాస్‌ ట్యూన్‌ సిద్ధం చేశారని తెలుస్తోంది. వచ్చే నెల మొదటి వారంలో హైదరాబాద్‌లో ఈ పాటని తెరకెక్కిస్తారు. దీనికోసం ప్రత్యేకంగా సెట్‌ని రూపొందిస్తున్నారు. ‘‘దేవిశ్రీ పాటలకు స్టెప్పులు వేయడం చాలా ఉత్సాహంగా ఉంటుంది. నేను కూడా ఓ మంచి మాస్‌ పాటకు చిందులేసి చాలా కాలం అయ్యింది. అందుకే ఈ పాట కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నా. తెరపై ఈ పాట కొత్తగా ఉండబోతోంద’’ని చెప్పింది తమన్నా.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.