
తాజా వార్తలు
వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిన కుమార్తె హత్య
సహకరించిన తల్లి... కడతేర్చిన ఆమె ప్రియుడు
మృతదేహాన్ని మూటగట్టి దాచిన వైనం
విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో ఘటన
ఈనాడు డిజిటల్, విజయవాడ: గొల్లపూడి, న్యూస్‌టుడే: పొత్తిళ్లలో పొదువుకుని తన నలుసును కాపాడాల్సిన తల్లే ఆ చిన్నారి జీవితాన్ని నలిపేసింది. అమ్మతనానికే తీరని మచ్చ తెచ్చింది. పరాయి వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని చూసి, ప్రశ్నించినందుకు సొంత పేగుబంధాన్ని తెంచేసుకుంది. తల్లే అనుమతించడంతో ఆమె ప్రియుడు ఎనిమిదేళ్ల చిన్నారిని అత్యంత పాశవికంగా హత్యచేసి మూట కట్టి, బీరువాలో దాచిన హృదయవిదాకర ఘటన విజయవాడ గ్రామీణ పరిధిలోని గొల్లపూడిలో చోటు చేసుకుంది. మొవ్వ అనిల్, వెంకటరమణలు భార్యాభర్తలు. అనిల్ ప్రభుత్వ మద్యం సరఫరా గోదాంలో కూలి పనికి వెళ్తుండగా.. వెంకటరమణ సమీపంలోని ఓ ప్రైవేటు కళాశాలలో స్వీపర్‌గా పనిచేస్తోంది. తమ ఇద్దరు అబ్బాయిలను నందిగామ మండలం గోళ్లమూడిలో బంధువుల ఇంటి దగ్గర ఉంచి చదివిస్తున్నారు. ఎనిమిదేళ్ల కుమార్తె ద్వారక తల్లిదండ్రులతోనే ఉంటూ స్థానిక పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. వీరి పక్కింట్లో పెంటయ్య అలియాస్ ప్రకాష్ తన భార్యతో కలిసి అద్దెకు ఉంటున్నాడు. అతని భార్య పుట్టింటికి వెళ్లింది. ఆదివారం సెలవు కావడంతో ద్వారక ఇంట్లోనే ఉండి... టీవీ చూసేందుకు పెంటయ్య ఇంటికి వెళ్లింది. అక్కడ తన తల్లి వెంకటరమణ, పెంటయ్య సన్నిహితంగా ఉండటాన్ని చూసింది. ఈ విషయమై తల్లిని నిలదీసింది. నాన్నకు చెబుతానంది. కంగారు పడిన వెంకటరమణ ‘నువ్వే ఏదో ఒకటి చెయ్.!’ అని పెంటయ్యకు చెప్పి హడావుడిగా బయటకు వెళ్లిపోయింది. నిందితుడు బాలికను తీసుకెళ్లి హత్య చేశాడు. మృతదేహాన్ని బయటకు తరలించే అవకాశం లేకపోవడంతో సంచిలో మూటగట్టి, దాన్ని పరుపు చాటున దాచాడు.
కనిపించలేదంటూ నాటకం
మధ్యాహ్నం బయటకు వెళ్లిపోయిన వెంకటరమణ సాయంత్రం ఇంటికి వస్తూనే అమ్మాయి ఏదంటూ భర్తను అడిగింది. ఆడుకునేందుకు వెళ్లిందేమో వస్తుందిలే అని ఆయన చెప్పారు. రాత్రి అయినా రాకపోవడంతో అక్కడడక్కడా తిరుగుతూ వెతుకుతున్నట్లు నిందితురాలు నటించింది. బాలిక కనిపించడం లేదని తెలియడంతో గ్రామస్థులంతా వెతకడం ప్రారంభించారు. ఈ విషయమై రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు స్పందించి బాలిక ఆచూకీ కోసం గాలింపు ప్రారంభించారు. నిందితులకు మృతదేహాన్ని బయటకు తీసుకెళ్లేందుకు వీలుపడలేదు.
నిందితుడి భార్యే పట్టించింది
పోలీసులు గాలింపు ముమ్మరం చేసి, ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. ఉదయం నుంచి తమతోపాటూ ఉంటూ చిన్నారి కోసం వెతికేందుకు సహకరించిన పెంటయ్యపై వారికి అనుమానం రాలేదు. ఈ నేపథ్యంలో ఊరి నుంచి వచ్చిన నిందితుడి భార్య సునీత కూడా బాలిక కోసం వెతుకులాడింది. సోమవారం మధ్యాహ్నం ఇంట్లోని పరుపును పక్కకు తీయగా మృతదేహం ఉన్న మూట కనిపించింది. నిర్ఘాంతపోయిన ఆమె విషయాన్ని గ్రామస్థులతో చెప్పడంతో విషయం బయటపడింది. వెంటనే పెంటయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక ముఖం, మెడపై కమిలిన గుర్తులు కనిపించాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోజంతా బాలిక కోసం వెతికిన గ్రామస్థులు హత్య విషయం తెలుసుకుని పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు. సంఘటన స్థలాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- దిశ మృతదేహంలో మద్యం ఆనవాళ్లు
- పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు
- ఎవరు.. ఎక్కడ?
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- గంగవ్వకు హీరోయిన్ కావాలని ఉందట!
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
- కాల్చేస్తున్నాం.. కూల్చలేకపోయారు!
- బుడ్డోడి బ్యాటింగ్‌కి కోహ్లీ ఫిదా!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
