
తాజా వార్తలు
యువకుడి వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి వివాహిత మృతి
పచ్చని సంసారంలో చిచ్చు
జైనూరు, న్యూస్‌టుడే: పచ్చని సంసారంలో ఓ ఫోన్ కాల్ చిచ్చుపెట్టింది. అదే పనిగా ఓ ఆకతాయి విసిగించడం.. భర్త అనుమానించడం.. ఇదంతా అవమానంగా భావించిన వివాహిత ప్రాణాలు తీసుకుంది. ఈ దారుణ ఘటన కుమురం భీం జిల్లా జైనూరు మండలం కొండిబగూడ గ్రామంలో జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలివి.. కొండిబగూడకు చెందిన రమాకాంత్‌కు నాలుగేళ్ల కిందట జైనూరు మండల కేంద్రంలోని శివాజీనగర్ వాసి సోన్‌కాంబ్లె సీతాల్(24)తో వివాహం జరిగింది. కూలీనాలీ చేస్తూ అన్యోన్యంగా కొనసాగుతున్న దంపతుల జీవితంలోకి అదే గ్రామానికి చెందిన బొడికే అనికేతన్ ఫోన్‌కాల్ ప్రవేశించడంతో చిచ్చురేగింది. తరచుగా సదరు వివాహితకు అనికేతన్ ఫోన్ చేసి వేధిస్తోండడంతో విసుగుచెందిన ఆమె అతణ్ని ఫోన్లోనే నిలదీసింది. కోపోద్రిక్తుడైన యువకుడు వివాహితపై ఆమె భర్తకు లేనిపోని మాటలు చెప్పి నమ్మించాడు. ఈ క్రమంలో ఈ నెల ఏడున రమాకాంత్ భార్యను నిలదీశాడు. ఇద్దరూ గొడవపడ్డారు. తనపై అకారణంగా నిందలు వేయడమే కాక ఫోన్ ద్వారా యువకుడు వేధింపులు ఆపకపోవడంతో సీతాల్ పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున సీతాల్ కన్నుమూసినట్లు ఎస్ఐ తిరుపతి పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాపు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- టీమిండియా సమష్టి విజయం
- ఉతికి ఆరేశారు
- రఘురామ కృష్ణరాజు విందుకు రాజ్‌నాథ్‌సింగ్
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
- ఏపీలో దిశ యాక్ట్:అత్యాచారం చేస్తే ఉరిశిక్షే
- దిల్లీ వెళ్లాలంటేనే భయమేస్తోంది: ఏపీ గవర్నర్
- పాస్‌పోర్ట్‌పై కమలం చిహ్నం?
- రూ.200 పెట్టి ఫస్ట్‌షో చూడండి!
- యడియూరప్పకు భాజపా ప్రశంసలు..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
