
తాజా వార్తలు
అమ్మను తరుముతున్న మరణం ఓ వైపు... అవసాన దశకు చేరిన ఆమెను ఇక్కడ ఉంచొద్దంటూ ఉరుముతున్న మనుషులు మరోవైపు... ఆ కుమారుడిని నిలువనీయలేదు. అరవై ఏడేళ్ల అమ్మ... కన్ననాటి నుంచి తనను కళ్లల్లో పెట్టుకుని పెంచిన అమ్మ... ఎన్నో కష్టాలకోర్చి తనను పెద్దచేసిన అమ్మ... క్యాన్సర్ బారిన పడేసరికి ఆ కుమారుడి హృదయం తల్లడిల్లింది. ఎలాగైనా సరే... ఆమెను కాపాడుకోవాలని తపించారు. రెండు రోజులుగా చేతులపై మోసుకుంటూ అక్కడికీ ఇక్కడికీ తిరిగారు. ఈ క్రమంలో ఎదురైన విపత్కర పరిస్థితులకు బాధను దిగమింగుతూ ఎదురొడ్డారు. సాటి మనిషి కష్టాల్ని చూసి చలించని మీ మనుషులకంటే నేనే నయమంటూ ఆఖరుకు మృత్యువే స్పందించింది. ఆ అమ్మను తనతో తీసుకువెళ్లింది.
వెంకటయ్య, వెంకటలక్ష్మి దంపతులది ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం సీఎస్‌పురం మండలం పెదరాజుపాలెం. మూడేళ్లుగా పామూరు పట్టణంలో ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు. నాలుగు నెలల కిందట వెంకటలక్ష్మి(67)కి క్యాన్సర్ సోకింది. మ్యారేజీ బ్యూరో నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న కుమారుడు సతీష్ ఆమెను పలు ఆసుపత్రుల్లో చూపించారు. చికిత్సల కోసం సతీష్ రూ.4 లక్షల దాకా ఖర్చు పెట్టారు. వెంకటలక్ష్మి ఆరోగ్యం క్షీణించగా ఈ నెల 18న పామూరులోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. రిమ్స్‌కు తరలించాలని అక్కడి వైద్యులు సూచించారు. తల్లిని ఇంటికి తీసుకొస్తుండగా మార్గంమధ్యలో ఇంటి యజమాని ఎదురొచ్చి, ఆమెను తన ఇంటికి తీసుకురావొద్దని సతీష్‌ను హెచ్చరించారు. చేసేది లేక సతీష్ తల్లిని తిరిగి స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆమెను అక్కడ ఉంచడం కుదరదని ఆసుపత్రి సిబ్బంది తేల్చి చెప్పారు. పంచాయతీ అధికారులు ‘చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం’లో ఇచ్చిన గదిలో ఆ రోజు రాత్రికి తలదాచుకోవాల్సి వచ్చింది. 19న ఉదయం సిబ్బంది వచ్చి, అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఒత్తిడి తెచ్చారు. దిక్కుతోచని స్థితిలో సతీష్ తన తల్లిని చేతులతో మోసుకుంటూ స్థానిక డీవీ పార్కుకు వెళ్లారు. అక్కడ టెంట్ వేసుకుని రాత్రి 8 గంటల వరకు అక్కడే ఉన్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. వృద్ధురాలిని పామూరు వైద్యశాలలో చేర్చుకోవాలని వైద్యాధికారికి సూచించారు. సిబ్బంది ఆమెను చేర్చుకున్నారు. అక్కడ చికిత్స పొందుతూ వెంకటలక్ష్మి బుధవారం మరణించారు. అంత బాధలో ఉంటే... స్నేహితులు, బంధువులు సహా ఎవరూ సాయం చేయలేదని, తన గోడు పట్టించుకున్న నాథులు లేరని, ఈ దుస్థితి వేరెవరికీ రాకూడదంటూ సతీష్ బోరుమన్నారు. స్థానిక శ్మశాన వాటికలో అశ్రునయనాలతో ఆ అమ్మకు అంత్యక్రియలు నిర్వహించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు
- దిశ మృతదేహంలో మద్యం ఆనవాళ్లు
- ఎవరు.. ఎక్కడ?
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- గంగవ్వకు హీరోయిన్ కావాలని ఉందట!
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
- బుడ్డోడి బ్యాటింగ్‌కి కోహ్లీ ఫిదా!
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
