
తాజా వార్తలు
తొలి డే/నైట్ టెస్టులో భారత్ జోరు
ఫాస్ట్‌బౌలర్ల జాతర.. పదికి పది వికెట్లు
30.3 ఓవర్లలో 106 పరుగులకే బంగ్లా ఆలౌట్
తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 174/3
నిండుగా స్టేడియం.. ఒకటే కేరింతలు.. అక్కడ ఐపీఎల్ మ్యాచ్ ఏమైనా జరుగుతోందా అనిపించే సందడి!
ఆరంభోత్సవంలో ఒక దేశ ప్రధాని.. ఒక రాష్ట్ర సీఎం.. విరామ సమయాల్లో దిగ్గజ ఆటగాళ్ల ఊరేగింపులు, సాంస్కృతిక ప్రదర్శనలు.. ప్రపంచకప్ ఏమైనా మొదలైందా అనిపించే హంగామా!
పదికి పది వికెట్లు పేసర్లకే.. ఇషాంత్ శర్మ ఖాతాలో అయిదు వికెట్లు.. మ్యాచ్‌కు ఏ డర్బనో, గబ్బానో ఆతిథ్యమిస్తోందా అనిపించే ఫాస్ట్‌బౌలింగ్ జోరు!
ఇదంతా ‘గులాబి’ మాయాజాలమే!
మన క్రికెట్ అభిమానులకు సరికొత్త అనుభూతి పంచుతూ.. అరుదైన దృశ్యాలకు వేదికగా నిలుస్తూ.. గులాబి బంతి భారత గడ్డపై ఘనంగా అరంగేట్రం చేసింది. తన తొలి డేనైట్ టెస్టులో కోహ్లీసేనకు శుభారంభాన్నందించింది.
ఆట వేళలు మారినా.. పరిస్థితులు మారినా.. బంతి కూడా మారినా.. భారత్ జోరుకు మాత్రం అడ్డే లేదు. ప్రత్యర్థిని 106కే కుప్పకూల్చి.. తొలి రోజే 68 పరుగుల ఆధిక్యం సాధించి.. మరో ‘మూడ్రోజుల విందు’కు రంగం సిద్ధం చేసుకున్న కోహ్లీసేన.. క్లీన్‌స్వీప్ సంకేతాలూ ఇచ్చేసింది.
కోల్‌కతా
చారిత్రక మ్యాచ్‌ను టీమ్ఇండియా అద్భుత రీతిలో ఆరంభించింది. తొలిసారిగా గులాబి బంతితో డే/నైట్ టెస్టు ఆడిన కోహ్లీసేన.. తొలి రోజే మ్యాచ్‌పై పట్టు సాధించింది. శుక్రవారం ఆరంభమైన సిరీస్ రెండో టెస్టులో గులాబి బంతుల్ని బుల్లెట్లలా ప్రయోగించిన పేసర్లు ఇషాంత్ శర్మ (5/22), ఉమేశ్ యాదవ్ (3/29), మహ్మద్ షమి (2/36).. బంగ్లాను 106 పరుగులకే కుప్పకూల్చారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లూ ఈ ముగ్గురు పేసర్లే పడగొట్టారు. 29 పరుగులు చేసిన ఓపెనర్ షాద్మన్ ఇస్లామే టాప్‌స్కోరర్. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్.. ప్రత్యర్థి స్కోరును సునాయాసంగా అధిగమించింది. 3 వికెట్లకు 176 పరుగులతో తొలి రోజు ఆటను ముగించింది. గులాబి బంతితో భారత్‌కూ కొంత ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. కెప్టెన్ విరాట్ కోహ్లి (59 బ్యాటింగ్; 93 బంతుల్లో 8×4), చెతేశ్వర్ పుజారా (55; 105 బంతుల్లో 8×4) ప్రమాదం లేకుండా చూశారు. కోహ్లికి తోడుగా రహానె (23 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఇప్పటికే 68 పరుగుల ఆధిక్యంలో ఉన్న టీమ్ఇండియా.. మిగిలిన 7 వికెట్లతో ఇన్నింగ్స్‌ను ఎక్కడిదాకా తీసుకెళ్తుందో చూడాలి.
4 ఓవర్లు మామూలే..: టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ సాహసోపేత రీతిలో బ్యాటింగ్ ఎంచుకోగా.. తొలి నాలుగు ఓవర్లు గులాబి బంతి సాధారణంగానే స్పందించడంతో అతడి నిర్ణయం సరైందే అనిపించింది. కానీ తర్వాతి ఓవర్ నుంచి మొదలైంది మాయ. బంతి వేగం పెరిగింది. స్వింగ్ కూడా అయింది. దీంతో బంగ్లా ఓపెనర్లకు కష్టాలు తప్పలేదు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో కయెస్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని భారత్‌కు శుభారంభాన్నందించాడు ఇషాంత్. బంగ్లా ఓపెనర్ సమీక్ష కోరినా ఫలితం లేకపోయింది. తొలి వికెట్ పడిందో లేదో.. బంగ్లా పతనానికి గేట్లు ఎత్తేసినట్లయింది. వరుసగా ముగ్గురు బ్యాట్స్‌మెన్ డకౌటైపోయారు. మొమినుల్, మిథున్‌లను ఉమేశ్ ఒకే ఓవర్లో ఔట్ చేయగా.. తొలి టెస్టులో భారత బౌలింగ్‌ను బాగానే ప్రతిఘటించిన ముష్ఫికర్‌ను బౌల్డ్ చేసిన షమి బంగ్లా కష్టాల్ని మరింత పెంచాడు. 15/0 నుంచి ఆ జట్టు 26/4కు చేరుకుంది. ఓ ఎండ్‌లో నిలకడగా ఆడుతున్న షాద్మన్ను ఉమేశ్ బోల్తా కొట్టించగా.. ఇషాంత్ తెలివిగా విసిరిన బంతికి మహ్మదుల్లా (6) వెనుదిరిగాడు. లంచ్ సమయానికి బంగ్లా స్కోరు 73/6. ఆత్మవిశ్వాసంతో ఆడుతున్న లిటన్ దాస్ (24) అప్పుడే తలకు బంతి తగిలి రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగాడు. రెండో సెషన్లో బంగ్లా ఇంకో పది ఓవర్లయినా నిలవలేదు. విరామం తర్వాత ఇషాంత్ విజృంభించాడు. ఆఫ్, లెగ్ కట్టర్లతో బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించడంతో స్కోరు వంద దాటగానే బంగ్లా ఆలౌటైంది.
కాస్త కష్టపడ్డా..: గులాబి బంతి, పరిస్థితుల ప్రభావాన్ని చూసుకుని భారత ఓపెనర్లు ఆచితూచి ఆడే ప్రయత్నం చేశారు. కానీ వాళ్లిద్దరూ ఎక్కువసేపు నిలవలేకపోయారు. మయాంక్ (14) ఇన్నింగ్స్ ఐదో ఓవర్లోనే ఔటైపోయాడు. ఒక జీవనదానం అందుకున్న రోహిత్ (21).. ఇబాదత్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఔట్ అని అర్థమవుతున్నప్పటికీ అతను సమీక్షకు వెళ్లి విఫలమయ్యాడు. 43/2తో భారత్ కాస్త ఇబ్బందికర స్థితిలోనే నిలిచింది. అయితే ఫ్లడ్‌లైట్ల వెలుతురులో గులాబి బంతి ప్రభావం తగ్గే వరకు ఎదురు చూసిన పుజారా, కోహ్లిలకు మంచి ఫలితమే దక్కింది. ఆట సాగే కొద్దీ బ్యాటింగ్ తేలికైపోయింది. మ్యాచ్ గులాబి బంతితో సాగుతోందన్న భావనే రానివ్వకుండా వీళ్లిద్దరూ అలవోకగా బ్యాటింగ్ చేశారు. చూడముచ్చటైన షాట్లతో అలరించారు. పుజారా అర్ధసెంచరీ దాటి.. వీరి భాగస్వామ్యం శతకం దిశగా వెళ్తుండగా.. ఇబాదత్ బంగ్లాకు కాస్త ఊరటనిచ్చాడు. పుజారాను ఔట్ చేశాడు. ఆ తర్వాత రహానెతో కలిసి కోహ్లి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు.
అంత వీజీ కాదు.. భారత క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. భారత గడ్డపై తొలి డే/నైట్ టెస్టు మొదలైంది. గులాబి బంతి అరంగేట్రం చేసింది. ఇన్నాళ్లూ సాగిన ప్రచారాతొలి రోజు ఆటలో ఈ బంతి ప్రత్యేకతను చాటుకుంది. ఈ బంతితో అంత సులువు కాదని అర్థమైంది. ఆరంభంలో నాలుగు ఓవర్ల ఆట మామూలుగా సాగిపోతుంటే.. ఏముంది గులాబి ప్రత్యేకత అనిపించింది. కానీ తర్వాతే తెలిసింది దాని మాయాజాలం. బౌలర్లు అంతగా ప్రయత్నం చేయకుండానే భలేగా స్వింగ్ అవుతూ.. మెరుపు వేగంతో బ్యాట్స్‌మెన్‌ను దాటి వెళ్లిపోతూ గులాబి బంతి ఆశ్చర్యపరిచింది. ఇక బౌలర్లు శ్రద్ధ పెట్టినపుడు మరింత స్వింగ్ అయి బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టించింది. అనుకున్నట్లే గులాబి బంతిని గుర్తించడం బ్యాట్స్‌మెన్‌కే కాదు.. ఫీల్డర్లకూ కష్టమైంది. బంగ్లా బ్యాట్స్‌మెన్ ఏం చేయాలో పాలుపోక అయోమయానికి గురైన వైనం స్పష్టంగా కనిపించింది. చివర్లో క్యాచ్ అందుకునే ప్రయత్నంలో రోహిత్ తడబాటు కూడా గులాబి మాయలో భాగమే. బ్యాట్స్‌మెన్ కాస్త ఆలస్యంగా స్పందిస్తే అంతే సంగతులని తొలి రోజు ఆటను బట్టి అర్థమైంది. కాస్త తెలివిగా బౌలింగ్ చేస్తే పేసర్లు ఈ బంతితో పండగ చేసుకోవచ్చని భారత పేస్ త్రయం రుజువు చేసింది. శుక్రవారం ఆటను బట్టి చూస్తే స్పిన్నర్లకు మాత్రం గులాబితో కష్టమే అనిపిస్తోంది. ఆట మొత్తంలో స్పిన్నర్ ఒక్క ఓవర్ (జడేజా) మాత్రమే వేయడం ఇందుకు నిదర్శనం. |
ఇషాంత్.. పుష్కరం తర్వాత |
ముందే పని కానిచ్చేశారు.. |
ఈడెన్ హోరెత్తేలా.. భారత్-బంగ్లాదేశ్ మధ్య తొలి డేనైట్ టెస్టు ఆరంభం అదిరింది.. అతిరథ మహారథులతో ఈడెన్‌గార్డెన్స్ మెరిసిపోయింది. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా, పశ్చిమ బంగా ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆటగాళ్లను పరిచయం చేసుకోవడంతో ఈ గులాబి బంతి సంబరం మొదలైంది. ఆ తర్వాత స్టేడియంలో గంటను మోగించిన హసీనా, మమత మ్యాచ్‌ను లాంఛనంగా ప్రారంభించారు. లంచ్ విరామ సమయంలో తెందుల్కర్, కుంబ్లే, లక్ష్మణ్, హర్భజన్లతో మైదానంలో మాట్లాడుతున్న సమయంలో అభిమానులు ‘సచిన్.. సచిన్’ అంటూ స్టేడియాన్ని హోరెత్తించారు. ఆ తర్వాత టీ విరామం సమయంలో భారత దిగ్గజ క్రికెటర్లు కపిల్‌దేవ్, సచిన్, అజహరుద్దీన్, సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, శ్రీకాంత్, వెంగ్‌సర్కార్, గుండప్ప విశ్వనాథ్, మిథాలీరాజ్, జులన్ గోస్వామి తదితరులు ప్రత్యేకమైన వాహనాల్లో ఈడెన్‌గార్డెన్స్ చుట్టూ తిరుగుతూ అభిమానులకు అభివాదం చేశారు. భారత స్టార్ క్రీడాకారిణులు పి.వి. సింధు, సానియా మీర్జా, మేరీకోమ్ ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు. తొలి రోజు ఆట అనంతరం భారత మాజీ కెప్టెన్లను సన్మానించారు. |
బంతి ఎక్కడ.. పుజారా చేతుల్లో! తొలి టెస్టులో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా భారత ఫీల్డింగ్ ఎంత పేలవంగా సాగిందో తెలిసిందే. ఏకంగా అయిదు క్యాచ్‌లు నేలపాలయ్యాయి. అయితే రెండో టెస్టు తొలి రోజు మాత్రం మనోళ్ల ఫీల్డింగ్ అదిరిపోయింది. భారత ఆటగాళ్లు కళ్లు చెదిరే క్యాచ్‌లు అందుకున్నారు. బంగ్లా కెప్టెన్ మొమినుల్ రెండో స్లిప్‌లోకి క్యాచ్ ఇస్తే.. బంతి కోహ్లి వైపు దూసుకెళ్తుండగా మూడో స్లిప్‌లో ఉన్న రోహిత్ కుడి వైపు డైవ్ చేస్తూ అద్భుత రీతిలో క్యాచ్ అందుకున్నాడు. తర్వాత మహ్మదుల్లా క్యాచ్‌ను వికెట్ కీపర్ సాహా మరింత ఆశ్చర్యకర రీతిలో అందుకున్నాడు. అతను డైవ్ చేస్తూ.. బంతి కింద పడే ముందు పట్టేశాడు. గ్లోవ్స్‌లో పడ్డాక కూడా బంతి చేజారేలా ఉన్నప్పటికీ అతను విడిచిపెట్టలేదు. మిడ్వికెట్లో చాలా తక్కువ ఎత్తులో వచ్చిన మెహిదీ హసన్ క్యాచ్‌ను కూడా పుజారా భలేగా అందుకున్నాడు. ఇక బంగ్లా చివరి వికెట్లో చిన్న చమత్కారం జరిగింది. స్లిప్‌లో రోహిత్ క్యాచ్ పట్టే ప్రయత్నం చేయగా.. చిక్కలేదు. బంతి అతడి చేతిని తాకి పక్కకు ఎగిరిపోగా.. పక్కనే ఉన్న పుజారా చురుగ్గా స్పందించి క్యాచ్ పట్టేశాడు. ఓవైపు అతను సంబరాలు చేసుకుంటుంటే.. రోహిత్ మాత్రం కొన్ని క్షణాల పాటు బంతి ఎటు పోయిందోనని అయోమయానికి గురి కావడం విశేషం. |
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: షాద్మన్ ఇస్లామ్ (సి) సాహా (బి) ఉమేశ్ 29; ఇమ్రుల్ కయెస్ ఎల్బీ (బి) ఇషాంత్ 4; మొమినుల్ హక్ (సి) రోహిత్ (బి) ఉమేశ్ 0; మహ్మద్ మిథున్ (బి) ఉమేశ్ 0; ముష్ఫికర్ రహీమ్ (సి) షమి 0; మహ్మదుల్లా (సి) సాహా (బి) ఇషాంత్ 6; లిటన్ దాస్ రిటైర్డ్ హర్ట్ 24; నయీమ్ హసన్ (బి) ఇషాంత్ 19; ఇబాదత్ హుస్సేన్ (బి) ఇషాంత్ 1; మెహిదీ హసన్ (సి) పుజారా (బి) ఇషాంత్ 8; అల్ అమిన్ నాటౌట్ 1; అబు జాయెద్ (సి) పుజారా (బి) షమి 0; ఎక్స్‌ట్రాలు 14 మొత్తం: (30.3 ఓవర్లలో ఆలౌట్) 106.
వికెట్ల పతనం: 1-15, 2-17, 3-17, 4-26, 5-38, 6-60, 7-82, 8-98, 9-105;
బౌలింగ్: ఇషాంత్ 12-4-22-5, ఉమేశ్ 7-2-29-3; మహ్మద్ షమి 10.3-2-36-2; జడేజా 1-0-5-0.
భారత్ తొలి ఇన్నింగ్స్: మయాంక్ (సి) మెహిదీ హసన్ (బి) అల్అమిన్ 14; రోహిత్ ఎల్బీ (బి) ఇబాదత్ 21; పుజారా (సి) షాద్మన్ (బి) ఇబాదత్ 55; కోహ్లి బ్యాటింగ్ 59; రహానె బ్యాటింగ్ 23; ఎక్స్‌ట్రాలు 2 మొత్తం: (46 ఓవర్లలో 3 వికెట్లకు) 174
వికెట్ల పతనం: 1-26, 2-43, 3-137
బౌలింగ్: అల్అమిన్ 14-3-49-1; అబు జాయెద్ 12-3-40-0; ఇబాదత్ హుస్సేన్ 12-1-61-2.
5000 విరాట్ కోహ్లి టెస్టుల్లో కెప్టెన్‌గా 5 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. |
2 ఓ టెస్టు ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ప్రదర్శనల్లో ఇషాంత్ (5/22)ది భారత్ తరఫున రెండో అత్యుత్తమ ప్రదర్శన. ఈ ఏడాదే వెస్టిండీస్‌పై బుమ్రా (5/7) అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. |
106 బంగ్లాదేశ్ స్కోరు. భారత్‌పై ఓ టెస్టు ఇన్నింగ్స్‌లో ఆ జట్టుకిది రెండో అత్యల్ప స్కోరు. 2000లో ఢాకా టెస్టులో 91 పరుగుల స్కోరు అత్యల్పం. |
4 బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లూ భారత పేసర్లే తీశారు. స్వదేశంలో భారత పేసర్లు ఈ ఘనత సాధించడమిది నాలుగోసారి మాత్రమే. ఇంతకుముందు 1981లో ఇంగ్లాండ్‌పై, 1983లో వెస్టిండీస్‌పై, 2017లో శ్రీలంకపై పదికి పది వికెట్లూ పేసర్లే పడగొట్టారు. |
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- ఎన్‌కౌంటర్‌పై సీపీఐ నారాయణ క్షమాపణ
- విచారణ ‘దిశ’గా...
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- ఘోర అగ్ని ప్రమాదం..43 మంది మృతి
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- కొడితే.. సిరీస్ పడాలి
- పెళ్లే సర్వం, స్వర్గం
- ‘శరద్ పవార్ కొన్ని విషయాలు దాచారు’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
