close

తాజా వార్తలు

ఇళ్ల కొనుగోలుకు సర్కారీ వెబ్‌సైట్‌

నేషనల్‌ రియల్‌ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు

ఈనాడు, దిల్లీ: దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఇళ్ల విక్రయం కోసం కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ రియల్‌ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (నరేడ్కో) మంగళవారం  https://www.housingforall.com/ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ కార్యదర్శి దుర్గాశంకర్‌ మిశ్ర దీన్ని ప్రారంభించారు. రెరా కింద నమోదైన నమ్మకమైన, భద్రమైన, నాణ్యమైన ఇళ్లను మాత్రమే ఈ వెబ్‌సైట్‌ ద్వారా విక్రయించనున్నట్లు ఆయన ప్రకటించారు. పూర్తిగా సిద్ధమైన ఇళ్లను వర్చువల్‌ రియాల్టీ ద్వారా పరీక్షించుకుని ఎంపికచేసుకోవచ్చని చెప్పారు. ఇందులో దాదాపు వెయ్యి ప్రాజెక్టులను లిస్ట్‌ చేయనున్నట్లు నరేడ్కో ప్రకటించింది. ఈ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవడానికి స్థిరాస్తి వ్యాపారులకు ఫిబ్రవరి 13 వరకు గడువు ఉంటుంది. ఫిబ్రవరి 14 నుంచి వినియోగదారులకు పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. మార్చి 1 నుంచి విక్రయాలు మొదలవుతాయి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.