close

తాజా వార్తలు

భాగ్యనగరమే

గణనీయంగా పెరుగుతున్న ఇళ్ల ధరలు
2019 జులై-సెప్టెంబరు మధ్య 9% పెరుగుదల నమోదు
అంతర్జాతీయ స్థాయి సూచీలో హైదరాబాద్‌కు 14వ స్థానం

దిల్లీ: భాగ్యనగరంలో స్థిరాస్తి రంగం ఊపును తాజా సూచీ ఒకటి కళ్లకు కట్టింది. మనదేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు గణనీయంగా పెరుగుతున్నట్లు తేల్చింది. గృహ రేట్ల పెరుగుదలకు సంబంధించిన అంతర్జాతీయ స్థాయి సూచీలో నగరానికి 14వ స్థానం దక్కినట్లు వెల్లడించింది. ఈ జాబితాలోని టాప్‌-20లో భారత్‌ నుంచి హైదరాబాద్‌కు మాత్రమే స్థానం దక్కినట్లు తెలిపింది.

2019 జులై-సెప్టెంబరు మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా 150 నగరాల్లో ఇళ్ల ధరల పెరుగుదలను పరిశీలించిన ప్రాపర్టీ కన్సల్టెంట్‌ సంస్థ ‘నైట్‌ ఫ్రాంక్‌’ తాజా సూచీని రూపొందించింది. ఇందులో హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అక్కడ గతేడాది జులై-సెప్టెంబరు మధ్య ఇళ్ల ధరలు 24 శాతం పెరిగాయి. 2, 3 స్థానాల్లో చైనాలోని షియాన్‌(15.9%), ఉహాన్‌(14.9%) నిలిచాయి. హైదరాబాద్‌లో గృహ రేట్ల పెరుగుదల 9 శాతంగా నమోదైంది.

‘నైట్‌ ఫ్రాంక్‌’ నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు
* హైదరాబాద్‌లో నివాస సముదాయాల నిర్మాణానికి సంబంధించి కొత్త ప్రాజెక్టులు ఎక్కువగా ప్రారంభం కాకపోవడంతో కొనుగోలుదారులు ఇప్పటికే సిద్ధంగా ఉన్న ఇళ్ల కొనుగోలుకు మొగ్గుచూపారు. దీంతో డెవలపర్లు బాగా బేరమాడగలిగారు. ధరల పెరుగుదల గణనీయంగా నమోదయ్యేందుకు ఈ పరిణామాలు దోహదపడ్డాయి.
* భారత్‌లో భాగ్యనగరం మినహా ఇతర అగ్రశ్రేణి నగరాల్లో గత నాలుగేళ్లలో ఇళ్ల ధరల పెరుగుదల.. రిటైల్‌ ద్రవ్యోల్బణం పెరుగుదల కంటే తక్కువగా ఉంది.
* సూచీలో పేర్కొన్న 150 నగరాల్లో ఇళ్ల ధరలు సగటున 3.2 శాతం పెరిగాయి. 2015 ద్వితీయ త్రైమాసికం తర్వాత నమోదైన అతి తక్కువ పెరుగుదల ఇదే.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.