close

తాజా వార్తలు

వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌.. రతన్‌ టాటా

ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో ప్రేమలో పడే ఉంటారు. తెలిసో తెలియకో. అందుకు ఎవరూ అతీతులు కాదు. అయితే అందరూ ప్రేమదాసులో..దేవదాసులో కానక్కర్లేదు. మౌనంగా ఆ ప్రేమను మనసులోనే దాచుకుని జీవితాన్ని తాను నమ్ముకున్న వారి కోసం నడిచే ‘సేవ’దాసులు కావొచ్చు.

ఆయనే రతన్‌ టాటా.: వయసు పెరిగినా.. మనసు మాత్రం ఆ తొలిప్రేమ దగ్గరే ఆగుతుంది. రతన్‌ జీవితంలోనూ అదే జరిగింది. కాలేజ్‌ పూర్తయ్యాక తన ప్రేయసిని పెళ్లి చేసుకునేదాకా కథ వచ్చింది కానీ.. చివరకు విడివడి.. ఒంటరి కావాల్సి వచ్చింది. ‘హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే’తో ఆయన తన జీవితం గురించి చెప్పుకొచ్చారు. చిన్న వయసులోనే తల్లిదండ్రులు విడిపోవడం, ఆ తర్వాత తను తన సోదరుడూ బామ్మతో కలిసి ఉండడం, ఆమె తమకు విలువలతో ఉండడం నేర్పించడం సహా పలు అంశాలను వివరించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..

బామ్మ గురించి..: మా అమ్మ మళ్లీ పెళ్లి చేసుకోవడంతో నన్ను, నా సోదరుడిని కాలేజ్‌లో అందరూ ర్యాగింగ్‌ చేశారు. అది కూడా చాలా కాలంపాటు. అయితే మా బామ్మ ఎలా హుందాగా ఉండాలో నేర్పారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ దాన్ని కాపాడుకోవాలని చెప్పారు. ఈ రోజు వరకు నేను విలువతోనే ఉండడానికి ఆమే కారణం.

ప్రేయసి గురించి..: అమెరికాలో ఉన్నపుడు ఓ అమ్మాయితో ప్రేమలా పడ్డా. ఇదంతా కాలేజ్‌ నుంచి నేను బయటకు వచ్చి ఒక ఆర్కిటెక్చర్‌ సంస్థలో ఉద్యోగంలో చేరాక జరిగింది. లాస్‌ ఏంజెలెస్‌లో ఉన్న ఆ రోజులన్నీ చాలా బాగా గడిచాయి. సొంత కారుండేది. నా ఉద్యోగాన్నీ ఇష్టపడేవాడిని. ఆ అమ్మాయిని మరింతగా ఇష్టపడేవాడిని. అయితే మా బామ్మను చూసి చాలా కాలం కావడంతో భారత్‌కు వెళ్లాను. ఆ సమయంలో ఆమె ఆరోగ్యం బాగా లేదు. అయితే నా ప్రేయసి కూడా నాతో పాటు భారత్‌కు వస్తుందనుకున్నా. అది 1962. భారత్‌-చైనా యుద్ధం జరుగుతున్న రోజులు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆమెను ఇక్కడకు పంపడానికి అంగీకరించలేదు. అలా మా అనుబంధం అక్కడితో ముగిసింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.