close

తాజా వార్తలు

బంగాల్‌లో అత్యధికంగా తొలి ఓటర్లు

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల సమరం మొదలైంది. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గానూ ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 90కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. కాగా.. వీరిలో 1.5కోట్ల మంది తొలిసారిగా ఈ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. ఇక కొత్త ఓటర్లు అత్యధికంగా ఉన్నది పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలోనే. 
ఎన్నికల సంఘం వివరాల ప్రకారం.. పశ్చిమబెంగాల్‌లో 20.1లక్షల మంది తొలిసారిగా తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌లో 16.7లక్షల మంది, మధ్యప్రదేశ్‌లో 13.6లక్షల మంది తొలి ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో రాజస్థాన్‌(12.8లక్షల మంది), మహారాష్ట్ర(11.9లక్షలు), తమిళనాడు(8.9లక్షలు), ఆంధ్రప్రదేశ్‌(5.3లక్షలు) ఉన్నాయి. దేశ రాజధాని దిల్లీలో 97,684 మంది తొలి ఓటర్లు ఉన్నారు. 2014లో ఓటర్ల సంఖ్య 81.45కోట్లుగా ఉండగా.. 2019లో 90కోట్లకు పెరిగింది. ఈ ఐదేళ్లలో కొత్తగా 8.4కోట్ల మంది ఓటర్లు పెరిగారు. 

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.