close

తాజా వార్తలు

‘మీఇంట్లో హత్య జరిగితే మాపై నెడతారా?’

వైకాపా నేతల తీరుపై మండిపడిన సీఎం చంద్రబాబు

అమరావతి: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి మరణవార్త విన్నప్పుడు చాలా బాధ కలిగిందని తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. వివేకా హత్యోదంతం తదనంతర పరిణామాలపై చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ‘‘మొదట వివేకా గుండెపోటుతో చనిపోయారని ప్రచారం జరిగింది.  వెనుక తలుపు తీసుకుని లోపలికి వెళ్లారని చెప్పారు. ఘటనాస్థలం వద్దకు సాధారణంగా ఎవరూ వెళ్లకూడదు. బెడ్‌రూమ్‌లో తలకు గాయమైందని గుడ్డ కట్టారు. సీఐ వెళ్లేలోపు రక్తం కడిగేశారు.. తర్వాత ఆస్పత్రికి తరలించారు. వివేకా శరీరంపై బలమైన గాయాలున్నాయి. ఆస్పత్రికి తీసుకెళ్లే వరకు విషయం ఎందుకు దాచారు? మృతదేహం చూసిన ఎవరికైనా హత్య అని తెలుస్తుంది. అసలు బెడ్‌రూమ్‌ ఎందుకు శుభ్రం చేశారు. ఈ విషయంలో నాతో పాటు లోకేశ్‌, తెదేపాపైనా ఆరోపణలు చేశారు. సహజ మరణానికి, హత్యకు వ్యత్యాసం తెలియదా? పోలీసులను కూడా సహజ మరణమే అని నమ్మించే ప్రయత్నం చేశారు. అవినాశ్‌రెడ్డికి హత్య విషయం ఎవరు చెప్పారు? వివేకా హత్యలో సాక్ష్యాలు లేకుండా చేసేందుకు ప్రయత్నించారు. మృతిపై కేసు అవసరం లేదని మొదట చెప్పారు. మీ ఇంట్లో హత్య జరిగితే ఇతరులపైకి నెడుతున్నారు. దారుణ హత్యకు గురైతే ముందే ఎందుకు చెప్పలేకపోయారు?’’ అంటూ వైకాపా అధ్యక్షుడు జగన్‌, ఆ పార్టీ నేతలను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

దోషులైతేనే సాక్ష్యాలు లేకుండా చెరిపివేస్తారు

‘‘వివేకా హత్యలో అనేక రహస్యాలు ఉన్నాయి. హత్యను కప్పిపుచ్చుకునేందుకు చాలా నాటకాలు ఆడారు. నేర మనస్తత్వం ఉన్నవాళ్లకే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. కావాలనే ఇతరులపై బురద చల్లుతున్నారు. గుండెపోటు అని పోలీసులను నమ్మించారు.. తప్పుదారి పట్టించారు. వివేకా ఇంట్లో ఉన్న అందరినీ విచారించాలి. ఆయన్ను ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందో తెలియాలి. బెడ్‌రూమ్‌ వద్ద 2లీటర్ల రక్తం ఉందని ఎఫ్‌ఐఆర్‌ కాపీలో ఉంది. వివేకా హత్యను రాజకీయ లబ్ధికి వాడుకుంటారా? హత్య జరిగిన చోట శవపంచనామా చేస్తారని తెలియదా? చట్టాన్ని అతిక్రమించి.. సాక్ష్యాలను తారుమారు చేసే అధికారం ఎవరికీ లేదు. సాక్ష్యాలు ధ్వంసం చేశారు కనుకే మీపై అనుమానాలు పెరిగాయి. దోషులైతేనే సాక్ష్యాలు లేకుండా చెరిపివేస్తారు. తొలుత సహజ మరణమని నమ్మించే ప్రయత్నం చేశారు. శవపరీక్ష తర్వాతే అన్ని విషయాలు బయటకు వచ్చాయి’’ అని సీఎం అన్నారు.

 

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.