close

తాజా వార్తలు

మాటిమాటికి మూత్రం పోస్తోందని...

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగ దంపతులు తమ మూడున్నరేళ్ల పాపను హైటెక్స్‌ సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాలకు పంపిస్తున్నారు. రోజూ మాదిరిగా ఈ నెల 10న కూడా చిన్నారి పాఠశాలకు వెళ్లింది. పాఠశాల ముగిసే సమయానికి తల్లి వెళ్లి పాపను ఇంటికి తీసుకొచ్చారు. రోజూ పాఠశాలలో ముచ్చట్లు చెప్పే ఆ చిన్నారి.. ఆ రోజు ఇద్దరు ఆయాలు తన జననాంగంలో రాయి ఉంచారని తెలిపింది. ఆయాలతో పాటు పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆ చిన్నారి తల్లి మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదుచేశారు. మాటిమాటికి మూత్రం పోస్తోందని ఆయాలు ఇంతటి దారుణానికి ఒడికట్టినట్టు తెలుస్తోంది. కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావు తెలిపారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.