close

తాజా వార్తలు

రూ.3 తీసుకున్నారా? అయితే రూ.9 వేలు కట్టండి

చండీగఢ్‌: షాపింగ్‌ మాల్స్‌కు వెళ్లినప్పడు క్యారీ బ్యాగ్‌కు అదనంగా డబ్బులు వసూలు చేయడం చూసే ఉంటాం. బిల్లులోనే క్యారీ బ్యాక్‌ ఛార్జీలు కూడా కలిపేస్తారు. కొందరు కిమ్మనకుండా డబ్బు కట్టేసి వస్తులు తెచ్చుకుంటారు. మరి కొందరు అదనంగా ఎందుకు వసూలు చేస్తున్నారని దుకాణం సిబ్బందితో గొడవ పడుతుంటారు. కానీ, చత్తీస్‌గఢ్‌లోని దినేశ్‌ ప్రసాద్‌ అనే వ్యక్తి ఇందుకు భిన్నంగా చేశారు. క్యారీ బ్యాగ్‌కు అదనంగా వసూలు చేయడంపై  వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన ఫోరం అధికారులు రూ.9 వేలు పరిహారంగా ఇవ్వాలని సదరు సంస్థను ఆదేశించారు.


వినడానికి కాస్తా ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. చండీగఢ్‌కు చెందిన దినేశ్‌ ప్రసాద్‌ గత ఫిబ్రవరి 5న స్థానిక బాటా దుకాణంలో చెప్పులు కొన్నాడు. అక్కడి సిబ్బంది చెప్పుల ధరతోపాటు అదనంగా క్యారీ బ్యాగ్ కోసం రూ. 3 వసూలు చేశారు. దీనిపై దుకాణం సిబ్బందితో ఆయన గొడవకు దిగాడు. ‘బ్యాగ్‌పై బాటా ఉత్పత్తులను ముద్రించి ఖర్చు లేకుండా ప్రచారం చేసుకుంటున్నారు. అంతేకాకుండా వినియోగదారుల నుంచి అదనంగా వసూలు చేస్తారా?’అంటూ ప్రశ్నించాడు. దీనికి అక్కడి సిబ్బంది విసురుగా సమాధానం చెప్పారు.  దీంతో దినేశ్‌ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు.  క్యారీ బ్యాగ్‌కు రూ.3 వసూలు చేసినా ఇబ్బంది లేదు కానీ, దానిపై ఆ సంస్థ ఉత్పత్తులను ముద్రించారని, ఇది వినియోగదారులను మోసం చేయడమేనని ఆయన ఫిర్యాదు చేశాడు. కేసును విచారించిన ఫోరం.. దినేష్‌కు క్యారీ బ్యాగ్‌ ఛార్జీ (రూ.3)తోపాటు వాణిజ్య ఆరోపణల కింద మరో రూ.1000, మానసికంగా ఆయనను వేదనకు గురి చేసినందుకు గానూ మరో రూ.3000 పరిహారంగా చెల్లించాలని బాటా ఇండియా సంస్థకు సూచించింది. అంతేకాకుండా రాష్ట్ర వినియోగదారుల వివాద పరిష్కార సంఘం ఖాతాలో రూ. 5000 డిపాజిట్‌ చేయాల్సిందిగా ఆదేశించింది. క్యారీ బ్యాగుల కోసం వినియోగదారుల నుంచి ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయరాదని బాటా ఇండియాకు సూచించింది. పర్యావరణ హితమైన పేపర్‌ బ్యాగులనే వినియోగదారులకు ఇవ్వాలని పేర్కొంది.
 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.